Site icon Prime9

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు

Hyderabad: తెలంగాణలో హైకోర్టులో నేడు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాళ్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జడ్జిలుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్‌‌, నగేష్‌‌ భీమపాక, పుల్లా కార్తీక్‌‌, కాజ శరత్, అడిషినల్‌‌ జడ్జిలుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌‌రావు బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇప్పటిదాకా హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్త వాళ్లతో కలిపితే ఈ సంఖ్య 35కు చేరుతుంది. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24. ఆరుగురు కొత్త వారు ప్రమాణం చేశాక మరో 8 జడ్జి పోస్టులు ఖాళీగా ఉంటాయి.

Exit mobile version