Site icon Prime9

Squid Game 2: ప్రపంచం మారితే గాని.. ఈ గేమ్‌ ఆగదు – ఉత్కంఠ పెంచుతున్న ‘స్క్విడ్‌ గేమ్’ ట్రైలర్‌

squid game 2 telugu trailer

Squid Game 2 Trailer: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్’. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. విడుదలైన 28 రోజుల్లోనే ఈ సిరీస్‌ ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మందిపైగా వీక్లించినట్టు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సక్వెల్‌ వచ్చేస్తోంది. తాజాగా స్క్విడ్‌ గేమ్ 2కి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. డిసెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు ట్రైలర్‌ను విడుద‌ల చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొంతమంది డబ్బు కోసం ఈ స్క్విడ్‌ గేమ్‌లో భాగమవుతారని ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. వయిలెన్స్‌తో సాగిన ఈ ట్రైలర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రమాదకరమైన గేమ్స్‌, బయటపెట్టే సీన్స్ చూస్తుంటే ఇదోక హారర్‌ థ్రిల్లర్‌ అనిపిస్తుంది. తెలుగులో రిలీజైన ట్రైలర్‌ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ అందుకుంది.

స్క్విడ్‌ గేమ్‌ విషయానికి వస్తే

జీవితంలో అప్పులపాలైన వారిని, ఆర్థిక అవసరాల ఉన్న 456 మందిని ఓ దీవికి తీసుకువెళ్తారు. అక్క‌డ‌ వారందరికి చిన్న‌పిల్ల‌లు ఆడుకునే రెడ్‌లైట్‌, గ్రీన్‌లైట్‌, టగ్ ఆఫ్‌ వార్ వంటి ఆటలు ఆడిస్తారు. మొత్తం ఆరు గేమ్స్ ఉంటాయి. ఫస్ట్‌ గేమ్‌ ఆడిన వారు రెండో రౌండ్‌.. ఇక్కడ గెలిచిన వారు మూడో రౌండ్‌కి అలా చివరి గేమ్‌ వరకు చేరుకున్న వారికి డబ్బులు ఇస్తామని చెబుతారు. అయితే గేమ్‌లో ఎలిమినేట్‌ అయిన వారిని నిర్వ‌హాకులు చంపేస్తూ ఉంటారు. చూడడానికి చిన్న‌పిల్ల‌ల ఆట‌లా ఉన్న మొత్తం వయొలెన్స్‌తో సాగుతుంది ఈ సినిమా. అన్ని లెవల్స్‌ దాటిన వారు చివరిగా ‘స్క్విడ్‌ గేమ్’ ఆడాల్సి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ గేమ్‌లో పాల్గొన్న వారికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, ఇంతకి వారు ప్రాణాలతో బయటపెడతారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంటుంది. సర్వైవల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కిన ఈ సిరీస్‌ ఇప్పుడు రెండో సీజన్‌ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సీజ‌న్ 2 విష‌యానికి వ‌స్తే..

స్క్విడ్ గేమ్ ఫ‌స్ట్ సీజ‌న్ గెలిచిన తర్వాత అందులో జ‌రుగుతున్న అన్యాయాలను బయటపెట్టాలి చూస్తాడు ప్లేయర 456. అతని పేరు గి-హన్. ఈ క్రమంలో గేమ్‌ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన అతడు తనని స్క్విడ్‌ గేమ్‌లోకి ప్రవేశపెట్టాలని నిర్వాహకులను కోరడం ట్రైలర్‌లో ఆసక్తిని కలిగిస్తుంది. మరి గి-హన్ మ‌ళ్లీ స్క్విడ్ గేమ్ ఎందుకు ఆడటానికి అనేది తెలియాలంటే సీజ‌న్ 2 వచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే.

Exit mobile version