Site icon Prime9

Nayanthara: నిజాన్ని బయటపెట్టడానికి ఎందుకు భయపడాలి – ధనుష్‌తో వివాదంపై నయనతార రియాక్షన్‌

Nayanthara About Dhanush Controversy: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో వివాదంపై నయనతార తాజాగా షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. గత కొద్ది రోజులుగా నయన్, ధనుష్‌ గొడవ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీటేల్‌’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్‌, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో నానుమ్‌ రౌడీ దాన్‌(నేనే రౌడి) చిత్రంలో మూడు సెకన్ల క్లిప్‌ వాడినందుకు ధనుష్‌ నయన్‌కు లీగల్‌ నోటీసులు పంపాడు. తన అనుమతి లేకుండ ఈ క్లిప్ వాడారంటూ రూ. 10 కోట్లు డిమాండ్‌ చేస్తూ కాపీరైట్ దావా వేశాడు.

దీంతో ధనుస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ నయన్ ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ క్యారెక్టరి తప్పు బడుతూ సంచలన కమెంట్స్ చేసింది. తాజాగా ఈ వివాదంపై మరోసారి నయన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ తాను ఆ లేఖ విడుదల చేయడానికి కారణం చెప్పింది. ఈ మేరకు నయన్‌ మాట్లాడుతూ.. “ధనుష్‌ బయటకు ఒకలా, వ్యక్తిగతంగా ఒకలా ఉంటాడు. అతడి నిజస్వరూపం బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టేంఉదకు నేనేందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే వ్యక్తిత్వం కాదు నాది. నా డ్యాక్యుమెంటరీ ఫిలీం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశానని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అది నిజం కాదు” అని తెలిపింది.

అలాగే “మూవీ వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్‌వోసీ కోసం ధనుష్‌ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్‌ చాలాసార్లు ఆయనకు ఫోన్‌ చేశాం. కామన్‌ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్‌ స్పందించలేదు. మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. ముందు నుంచి మంచి స్నేహితులంగా ఉన్నాం. కానీ ధనుష్‌కి మేమంటే ఎందుకు ద్వేషమో తెలియదు. ధనుష్‌ని మంచి స్నేహితుడు అనుకున్నా. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్‌ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు” అని నయనతార చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

Exit mobile version