Site icon Prime9

Nayanthara: డాక్యుమెంటరీ వివాదం – ధనుష్‌ను ఉద్దేశిస్తూ నయనతార సంచలన పోస్ట్‌!

Nayanthara Shocking Post: హీరోయిన్‌ నయనతార, ధనుష్‌ వివాదం రోజురోజుకు ముదురుతోంది. డాక్యుమెంటరి రిలీజ్ నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహరంలో ఇద్దరు కూడా తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నయనతార జీవిత కథను నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీగా రూపొందించి విడుదల చేసింది. అయితే ఇందులో నయన్‌ భర్త దర్శకత్వం వహించిన నానుమ్‌ రౌడీ దాన్‌ చిత్రంలోని మూడు సెక్లన్ల క్లిప్‌ వాడటంపై ధనుష్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తను నిర్మించిన ఈ సినిమా నుంచి తన అనుమతి లేకుండా ఈ క్లిప్‌ వాడటంతో కాపీ రైట్‌ కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ నోటీసులు ఇచ్చాడు.

వీటిపై నయన్‌ స్పందించకపోవడం ధనుష్‌ ఏకంగా మద్రాస్‌ హైకోర్టు దావా వేశాడు. నయనతారా ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ల పేరును పేర్కొంటూ వీరిపై కేసు ఫైల్‌ చేశాడు. దీనికి హైకోర్టు కూడా విచారణకు రావాలని వారిని ఆదేశిచింది. ఈ క్రమంలో నయన్‌ పరోక్షంగా ధనుష్‌కి ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇచ్చింది. “అబద్ధాలతో ఎదుటివారి జీవితాన్ని నాశనం చేయాలనుకునే వారు.. దానికి ఇంట్రెస్ట్‌తో సహా తిప్పి కొడుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. ఇది చూసిన వారంతా ఇది ధనుష్‌ను ఉద్దేశించి చేసిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నయన్‌ పోస్ట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Exit mobile version