Site icon Prime9

Dasara: అబ్బా ఇలాంటి సీన్ ఎందుకు తీసేశారు భయ్యా.. దసరా డిలీటెడ్ సీన్ రిలీజ్

dasara

dasara

Dasara: థియేటర్ల వద్ద ఇంకా దసరా హవా కొనసాగుతూనే ఉంది. నేచురల్ స్టార్ నానిను 100కోట్ల సినిమా క్లబ్లో చేర్చిన సినిమా దసరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ నిలిచింది. మార్చి 30న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో నానిఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ శెట్టి చనిపోయిన తరువాత జరిగిన ప్రతీ సీన్ కూడా మనసులను ఎమోషనల్ గా టచ్ చేశాయని చెప్పవచ్చు. నాని, కీర్తి మధ్య వచ్చే సీన్స్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి డిలీట్ సీన్ ఒకటి ఇప్పుడు నెట్టింట రచ్చచేస్తుంది. ఫుల్లీ ఎమోషన్స్ తో నిండిన ఈ సీన్ చూసినవారు అయ్యో ఈ సీన్ ఉంటే ఎంత బాగున్నో అనుకుంటున్నారు.

సీన్ ఏముంది భయ్యా(Dasara)..

కీర్తిని నాని పెళ్లిచేసుకున్న తర్వాత కీర్తి తన పుట్టింటికి వచ్చి ఎవడితో పడితే వాడు వచ్చి తాళికడితే వాడితో పంపించేస్తావా నీ కూతురిని మాట్లాడూ అంటూ తన తల్లి దగ్గర అరవడం.. ఆ తరువాత తన అత్త వచ్చి కీర్తిని, నాని ఇంటి దగ్గరకు తీసుకు వెళ్లి ఇదే నీ ఇల్లు లోపలికి వెళ్లు అని బతిమాలడం ఇక ఈ సీన్ మొత్తాన్ని నాని ఓ గోడ పక్కన ఉండి వినడం కనిపిస్తుంది. ఇలా చూపురలను ఎంతో ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. ఇక ఈ సీన్ చూసిన ఆడియన్స్ అరే ఇంత మంచి సీన్ ని ఎందుకు సినిమాలో నుంచి తీసేశారని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఈ సినిమాలోని మరికొన్ని డిలీటెడ్ సీన్స్ కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారట చిత్రబృదం.
#Dasara Deleted Scene - 1 | Nani | Keerthy Suresh | Dheekshith S | Srikanth Odela | Now in Cinemas

ప్రస్తుతం నాని దసరా సందడి ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో నాని కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తండ్రీకూతుర్ల సెంటిమెంట్ తో రాబోతున్న ఈ చిత్రంలో నాని మరోసారి తండ్రిగా నటించనున్నాడు మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

Exit mobile version
Skip to toolbar