Nara Lokesh Yuvagalam Day 1: మీ జగన్ మాదిరిగా తల్లిని, చెల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటలేదు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
4వేల కిలో మీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. నాకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారు.
చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా? అని అడుగుతున్నానన్నారు.
పంపించండి.. చీర, గాజులు.. మా అక్కలు, చెళ్లెల్లకు ఇస్తానని తెలిపారు.
మీ జగన్ మాదిరిగా తల్లీ, చెల్లిని బయటకు గెంటలేదు.. మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి’’ అని లోకేశ్ హెచ్చరించారు.
జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు : నారా లోకేష్
జగన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నాడు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు.. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు.
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు.. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ?
ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు ఏమైంది? మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని ప్రశ్నిస్తున్నా.
దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జాదూరెడ్డి.. డిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.
ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి.
జే ట్యాక్స్ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని ప్రగల్భాలు పలికారు.
కానీ, అది బుల్లెట్లు లేని గన్ అని ప్రజలకు అర్థమైంది’’ అని లోకేశ్ విమర్శించారు.
‘‘యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం.
ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం.
ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటాం.
యువగళం పాదయాత్ర ప్రకటించగానే 10మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు.
ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను.
ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా.
నన్ను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు.. వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలురావు’’
‘‘పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలోనే తెలుగు జాతి గర్వ పడేవిధంగా ఎన్టీఆర్‌కృషి చేశారు.
ఆంధ్రుల సత్తా ఏంటో చంద్రబాబు చేసి చూపించారు. కానీ, ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు.
ఈ మూడేళ్లలో వైకాపా చేసిందేమిటి? అని ప్రశ్నించారు. ప్రస్తుతం లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/