Nandamuri Balakrishna: గత మూడు, నాలుగు రోజులుగా నందమూరి బాలకృష్ణ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు.
ఇటీవలే బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు.
వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు.. ఆ రంగారావు .. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని అన్నారు.
ఇక్కడ బాలయ్య అక్కినేని తొక్కినేని అని అనడంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా తప్పు బడుతున్నారు.
దీంతో బాలయ్యపై సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ మేరకు రాజకీయంగా, సినిమా పరంగా కూడా తీవ్ర విమర్శలపాలవుతున్నారు.
ముఖ్యంగా కాపు సంఘం నేతలు, అక్కినేని అభిమానులు ఓ రేంజ్ లో బాలయ్య పై ఫైర్ అవుతున్నారు.
ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమాన సంఘాలు నందమూరి బాలకృష్ణపై వీరలెవల్లో ఫైర్ అయ్యారు.
అక్కినేని నాగేశ్వరరావును కించపరిచే అర్హత బాలయ్యకు ఉందా అంటూ మండిపడ్డారు. వెంటనే అక్కినేని కుటుంబానికి క్షమాపణలు డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై నాగ చైతన్య, అఖిల్ కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
అయితే తాజాగా అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు.
బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఏమన్నారంటే..
ఏఎన్నార్ కు తన గుండెల్లో ప్రేమ ఉంటుందని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.
అనంతపురం జిల్లాలో గురువారం నాడు పర్యటనలో భాగంగా బాలకృష్ణ వివరణ ఇచ్చారు.
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు కావాలని చేసిన కాదని ఏదో యాదృచ్చికంగా చేసినవని ఆయన వివరణ ఇచ్చారు.
ఏఎన్నార్ ను కించపర్చే ఉద్దేశ్యం కానీ అగౌరవపరిచాలనే ఇంటెన్షన్ కానీ తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయి అని పిలుస్తానని గుర్తుచేసుకున్నారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందన్ని బాలయ్య తెలిపారు.
బయట జరిగే వాటిని తాను పట్టించుకోనన్నారు.
నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా తనపై ప్రేమ కురిపించేవారని అలాంటి ఏఎన్నార్ పై కావాలని కించపరిచే వ్యాఖ్యలు చెయ్యను చెయ్యబోనని ఆయన స్పష్టం చేశారు.
పొగడ్తలకు పొంగిపోకూడదని తాను నాగేశ్వరరావును చూసే నేర్చుకున్నానని బాలకృష్ణ చెప్పారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్లు సినీ రంగానికి రెండు కళ్లు లాంటివాళ్లని ఆయన తెలిపారు.
మరోవైపు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు మనవళ్లు కూడా స్పందించారు.
అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావును బాలకృష్ణ అవమనించారంటూ వస్తున్న వార్తలపై వారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
అందులో వారు మాట్లాడుతూ.. బాలకృష్ణ మాటల్లో తమకు ఎలాంటి వివాదం కనిపించలేదన్నారు.
బాలకృష్ణతో తమకు మంచి సంబంధం ఉందని, కాబట్టి ఈ వివాదాన్ని ఇంకా సాగదీసి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పాడు చేయొద్దని కోరారు.
తాము ఒకే కుటుంబంలా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారని అన్నారు.
ఈ విషయంలో తమకు ఎలాంటి వివాదం కనిపించడం లేదని ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్‌వీఎల్ఎస్ రంగారావు (బాబాజీ) విజ్ఞప్తి చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/