Site icon Prime9

Bhairava Dweepam : రీ రిలీజ్ కి రెడీ అయిన నందమూరి బాలకృష్ణ “భైరవద్వీపం”..

nandamuri balakrishna Bhairava Dweepam movie re release

nandamuri balakrishna Bhairava Dweepam movie re release

Bhairava Dweepam : రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్ ప్రస్తుతం గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో మంచి కలెక్షన్లను కూడా బాగా వస్తుండటంతో ఇటీవల సినిమాల రీ రిలీజ్ లు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ఫాంటసీ డ్రామా ‘భైరవ ద్వీపం’ త్వరలో రీ రిలీజ్ కాబోతుంది.

Bhairava Dweepam

ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయిడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం 1994లో రిలీజయి భారీ విజయం సాధించింది. బాలకృష్ణ, రోజా ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా కథ, పాటలు, కథనం అప్పట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. కలెక్షన్స్ సాధించడమే కాక 9 నంది అవార్డులని గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది భైరవ ద్వీపం. భైరవ ద్వీపం సినిమాని 4K వర్షన్ లో మార్చి క్లాప్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సంస్థ ఆగస్ట్‌ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar