Site icon Prime9

Nagababu: ‘పుష్ప 2’ రిలీజ్‌కి ముందు నాగబాబు ఆసక్తికర ట్వీట్‌

Nagababu Tweet Viral: అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ రిలీజ్‌ నేపథ్యంలో మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. పుష్ప 2 రిలీజ్‌ అడ్డుకుంటామంటూ మెగా ఫ్యాన్స్‌ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ క్రమంలో నాగబాబు వేసిన ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. కాగా పుష్ప 2 ఇవాళ గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది. డిసెంబర్‌ 5న మూవీ విడుదల కాగా ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్‌ వేశారు. బుధవారం రాత్రి 9:30 గంటల నుంచి ప్రీమియర్స్‌ వేయగా మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పార్ట్‌ 1 మించి పార్ట్‌ 2 ఉందంటున్నారు.

అయితే పుష్ప 2 రిలీజ్‌ సందర్భంగా జనసేన నేతలు, మెగాఫ్యాన్స్‌ నుంచి అల్లు అర్జున్‌కి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకుండ మూవీ రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్‌కు కొన్ని గంటల ముందు నాగబాబు సినిమాను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. “24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో.. వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే ‘సినిమా’ ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం… అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను…” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక ట్వీట్‌లో మెగా అభిమానులు కాస్తా కూల్‌ అయినట్టు కనిపిస్తుంది.

Exit mobile version