Site icon Prime9

Naga Chaitanya: చై-శోభితల వివాహ వేదిక ఇదేనా? – పెళ్లి ఎప్పుడంటే..!

Naga Chaitanya Sobhita Dhulipala Wedding Venue: అక్కినేని ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది ఆగష్టు 8న ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నిశ్చితార్థం వరకు ఎలాంటి ప్రకటన, సమాచారం లేకుండ గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

ఎంగేజ్‌మెంట్‌ అనంతరం హీరో నాగార్జున ఫోటోలు షేర్‌ చేయడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా చై-శోభితలు హాట్‌టాపిక్‌ అయ్యారు. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తూ ఈ జంట ఫ్యాన్స్‌ మాత్రం ఖుష్‌ అయ్యారు. వీరిద్దరు శుభాకాంక్షలు తెలుపుతూ పెళ్లిపై ఆరా తీశారు. అయితే పెళ్లి తేదీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలయ్యాయి. దీంతో చై-శోభిత పెళ్లి అతిత్వరలోనే అనేది తేలిపోయింది.

డిసెంబర్‌ 4న వీరి వివాహనికి ముహుర్తం ఫిక్స్‌ అయ్యిందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ముందుకు డెస్టినేషన్ వెడ్డింగ్‌ అనుకున్నారట. కానీ అది చైకి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. గతంలో సమంతతో డిస్టెనేషన్‌ వెడ్డింగ్‌ జరగ్గా ఆ బంధం నిలవలేకపోయింది. దీంతో ఆ ఆలోచనను విరమించుకుని రాజస్థాన్‌లో ఓ ప్యాలెస్‌లో చేద్దామని ప్లాన్‌ చేసిందట అక్కినేని ఫ్యామిలీ. కానీ, ఇప్పుడు అది కూడా క్యాన్సిల్‌ చేసి హైదరాబాద్‌లోని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట.

అందుకు అన్నపూర్ణ స్టూడియోను వివాహ వేదికగా నిర్ణయించారు. ఇందుకోసం నాగ్‌ ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌కి పెళ్లి వేదిక పనులు కూడా అప్పగించారట. ఫైనల్‌గా చై-శోభితల పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో వేదికగా మారనుందని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. నిజానికి అంతా బాగుంటే వారి ఎన్‌-కన్వెన్షన్‌లోనే పెళ్లి జరిగేది. దానికి హైడ్రా కూల్చివేయడంతో అన్నపూర్ణ స్టూడియోలో చేయాల్సి వస్తోంది.

Exit mobile version