Site icon Prime9

Naga Chaitanya: నాగ చైతన్య-శోభితల పెళ్లి కార్డు చూశారా? – అందులో ఏముందంటే..

Naga Chaitanya and Sobhita Dhulipala Wedding Card: త్వరలో అక్కినేని వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. హీరో నాగచైతన్య నటి శోభితల వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. బంధుమిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో చై-శోభిత వెడ్డింగ్‌ కార్డు ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కొంతకాలంగా నాగచైతన్య-శోభితల పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయంటూ వార్తలు వచ్చినా పెళ్లి తేదీని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించారు. దీంతో పెళ్లె తేదీ కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శోభిత-నాగచైతన్య పెళ్లి కార్డు ఇదేనంటూ నెట్టంట వైరల్‌గా మారింది.

ఇందులో నాగచైతన్య – శోభితల పెళ్లి డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్టు వెల్లడించారు. ఈ వివాహ మహోత్సవానికి కుటుంబం సమేతంగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించాలంటూ కార్డులో రాసుకొచ్చారు. ఇక ముఖ్య అతిథుల కోసం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను డిజైన్‌ చేయించినట్టు తెలుస్తోంది. ఇందకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Exit mobile version