Site icon Prime9

Chay-Sobhita: ఏఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు ఈవెంట్‌ – జంటగా కనువిందు చేసిన చై-శోభిత, ఫోటోలు వైరల్‌

Sobhita Grand Entry in ANR National Award Event: నేడు ఏఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు కార్యక్రమం అన్నపూర్ణ స్డూడియోలో ఘనంగా జరిగింది. ఈ ఏడాదికి గానూ అక్కినేని నేషనల్‌ అవార్డును మెగాస్టార్‌ చిరంజీవి అందుకున్నారు. బాలీవుడ్‌ బిగ్‌బి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ వెంట్‌కు రామ్‌ చరణ్‌, కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌, విక్టరి వెంకటేష్‌, ఎమ్‌ఎమ్‌ కిరవాణి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అమితాబ్‌ చేతుల మీదుగా ఏఎన్‌ఆర్‌ నేషనల్‌ చిరంజీవి అందుకున్నారు. అవార్డు ప్రదానం అనంతరం ఆయన బిగ్‌బి కాళ్లకు నమస్కరించిన క్షణం ప్రతి ఒక్కరిని బావోద్వేగానికి గురి చేసింది.

 స్పెషల్‌ అట్రాక్షన్‌గా శోభిత

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ వెంట్ లో అక్కినేని కాబోయే కోడలు శోభిత ధూళిపాళ్ల స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్యారోట్ క్రిన్ శారీలో ఈ వెంట్‌కు ఆమె గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి వచ్చిన శోభితకు అక్కినేని ఫ్యామిలీ ప్రేమతో ఆహ్వానం పలికింది. వచ్చి రాగానే నాగార్జున కోడలిని అప్యాయంగా పలకిరించారు. ఆ తర్వాత నాగ చైతన్య శోభిత వెంటే కనిపించాడు. ఈవెంట్‌ మొత్తంలో చై, శోభితా పక్కనే నడుస్తూ కనిపించాడు.

జంటగా కనువిందు

ఇలా వీరిద్దరు జంటగా ఏఎన్‌ఆర్‌ అవార్డు ఫంక్షన్‌లో కనువిందు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది కొందరు లక్క్‌ అంటే శోభితాదే అంటున్నారు. మరోవైపు చై-సామ్‌ ఫ్యాన్స్‌ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. శోభితా స్థానంలో సమంత ఉంటే ఇంకా బాగుండేదని, ఎందుకిలా చేశారు నాగ చైతన్య అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచిన శోభిత.. ఏఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు ఈవెంట్‌లో కనిపించి మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగా సమంతతో విడాకుల అనంరతం నాగ చైతన్య, శోభితతో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ అవన్ని పుకార్లని అక్కినేని ఫ్యాన్స్‌ కొట్టిపారేశారు. అలాగే శోభిత కూడా తనకు చైకి ఏం లేదని చెప్పింది. కానీ వీరిద్దరి డేటింగ్‌ ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. వీరిద్దరి రిలేషన్‌పై అందరిలో ఎన్నో సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఆగష్టు 8న సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది ఈ జంట. ఇక త్వరలోనే మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే చై-సో(Chayso) పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇటీవలె పెళ్లి పనుల్లో భాగంగా పసుపు దంచుతున్న ఫోటోలను శోభిత షేర్‌ చేయగా అవి వైరల్ గా మారాయి.

Exit mobile version