Sobhita Dhulipala: 2018లోనే చైతో పరిచయం, తనతో ప్రేమ అలా మొదలైంది: శోభిత

  • Written By:
  • Updated On - December 17, 2024 / 12:14 PM IST

Naga Chaitanya and Sobhita Dhulipala: నాగచైతన్య, శోభితలు ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్‌ సినీ ప్రముఖులంతా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లయిన ఈ కొత్త జంట తాజాగా ఓ అంగ్ల మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి పరిచయం, ప్రేమ గురించి తొలిసారి నోరువిప్పారు. నిజానికి చై-శోభితల పరిచయం ఎప్పుడైంది, వీరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా వారు చేసిన కామెంట్స్‌ ఆసక్తిగా మారాయి. నాగచైతన్య-శోభిత పెళ్లయి రెండు వారాలు అవుతుంది. పెళ్లయిన తర్వాత తొలిసారి జంటగా వీరు బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి తమ పరిచయం గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి శోభిత మాట్లాడుతూ.. “మొదటి సారి మేము 2018లో కలిశాం. అప్పడు నేను నాగార్జున గారి ఇంటికి వెళ్లాను. అప్పుడే చైతన్యతో పరిచయం. కానీ, 2022 ఏప్రిల్‌ నుంచి మా మధ్య స్నేహం మొదలైంది” అని చెప్పింది.

“2022 నుంచి చై, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరం ఫాలో అవుతున్నాం. నేను ఎప్పుడూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటాను. నేను పెట్టే గ్లామర్‌ ఫోటోలకి కాకుండా ఇన్‌స్పెరేషనల్‌ పోస్ట్స్‌కి లైక్ చేసేవాడు. అలా ఒకరి అభిప్రాయాలను ఒకరం పంచుకునేవాళ్లం. ఇక మేము ఎప్పుడు కలిసి తెలుగులోనే మాట్లాడుకునేవాళ్లం. దానివల్ల మా బంధం మరింత బలపడింది. నేను ఫుడ్డీ. మేం ఎప్పుడు కలిసిన ఫుడ్‌ గురించి మాట్లాడుకుంటూ మా అభిప్రాయాలు పంచుకునేవాళ్లం” అంటూ చెప్పుకొచ్చింది.

ఫస్ట్‌ మీట్‌ ఎక్కడంటే

నాగచైతన్యను మొదటిసారి ఓ కేఫ్‌లో కలిశానంది శోభిత. “నేను చై మొదటి సారి ముంబైలోని ఓ కేఫ్‌లో కలిశాను. అప్పుడు నేను ముంబైలో ఉండేదాన్ని. చై హైదరాబాద్‌లో ఉండేవాడు. తరచూ నా కోసం ముంబై వచ్చేవాడు. మొదటిసారి మేం డేట్‌కి వెళ్లినప్పుడు నేను రెడ్‌ డ్రెస్‌, నాగచైతన్య బ్లూ సూట్‌ వేసుకున్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయంలో గడిపాం. ఒకరినొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌కు వెళ్లాం” అని చెప్పింది. ఆ తర్వాత చై ఫ్యామిలీ తనని గోవాలో న్యూఇయర్‌ వేడుకలకు ఆహ్వానించినట్టు చెప్పింది. ఆ నెక్ట్స్‌ ఇయర్‌ చైతన్య మా ఫ్యామిలీ కలిశాడని తెలిపింది.

అనంతర నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత, నేను తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను ఎప్పుడు కలిసిన తనని తెలుగులోనే మాట్లామని అడిగేవాడిని. ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తుంది. వారితో ఆయా భాషలోనే మాట్లాడాలి. ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడేవాళ్లను చూస్తే నాకు ముచ్చేటేస్తుంది. వాళ్లతో నేను త్వరగా కనెక్ట్‌ అయిపోతాను. అందుకే శోభిత పరిచయం అయ్యాకు తనని తెలుగులోనే మాట్లామని అడిగేవాడిని” అని అన్నాడు.