Site icon Prime9

Mukesh Ambani: ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్‌

Mumbai: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఈ రోజు ఉదయం ఆగంతకుడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.

ఫోన్ నెంబరును ట్రేస్ చేసి ఆగంతకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు.

Exit mobile version