Site icon Prime9

Mohan Babu: పరారీలో ఉన్న మోహన్‌ బాబు? – ట్వీట్‌తో స్పందించిన నటుడు

Mohan Babu Abscond From Police?: సినీ నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. జర్నలిస్ట్‌ దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పటిషన్‌ వేశారు. కానీ కోర్టు ఆయన పటిషన్‌ని కొట్టివేసిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆయన పోలీసులకు అందుబాటులోకి లేకుండ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది. తనపై వస్తున్న వార్తలపై స్వయంగా మోహన్‌ బాబు స్పందించారు.

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. “నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్లలేదు. నా బెయిల్‌ పటిషన్‌ కొట్టివేశారంటూ వార్తలు సృష్టిస్తున్నారు. అందులో నిజం లేదు. అది విచారణకు రావాల్సి ఉంది. అజ్ఞాతంలోకి వెళ్లానంటూ వస్తున్న వార్తలు కూడా నిజం కాదు. ప్రస్తుతం నేను ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయొద్దని మీడియాని కోరుతున్నా” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కాగా ఇటీవల మోహన్‌ బాబు ఇంట్లో ఆస్తి వివాదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్‌, మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరస్పర ఆరోపణలతో ఆరోపణలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం డిసెంబర్‌ 10న జల్‌పల్లిలో మోహన్‌ బాబు నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. మనోజ్‌ గెట్లు బద్దలుకొట్టి లోపలికి బలవంతంగా వెళ్లాడు. మనోజ్‌, అతడి అనుచరులను మోహన్‌ బాబు, విష్ణు బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఒకేసారి చాలా మంది తన ఇంట్లోరి ప్రవేశించడంతో సహనం కొల్పోయిన మోహన్‌ బాబు మీడియా ప్రతినిథిపై దాడి చేశారు.

జర్నలిస్టులో ఫిర్యాదుతో ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మోహన్‌ బాబు హత్యాయత్నం కేసు నమోదు చేస్తూ నోటీసులు ఇచ్చారు. అనారోగ్యంతో అస్పత్రిలో చేరిన మోహన్‌ బాబు 48 గంటల చికిత్స అనంతరం నిన్న డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ వెంటనే గాయపడిని జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెప్పారు. కానీ ఈ కేసు ఆయనపై ఉండటంలో పోలీసులు మోహన్‌ బాబు స్టేట్‌మెంట్‌ కోసం ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకుండా పోయారని ఒక్కసారిగా వార్తు వచ్చాయి. దీంతో పోలీసులు 5 బ్రందాలుగా ఏర్పడి ఆయన కోసం గాలిస్తున్నట్టు వార్తలు వినిపించాయి.

Exit mobile version