Site icon Prime9

Mohan Babu: ఆస్పత్రిలో చేరిన నటుడు మోహన్‌ బాబు

సినీ నటుడు మోహన్‌ బాబు ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండె నొప్పి సమస్యతో చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. హాస్పిటల్‌లో మోహన్‌ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. నేడు (బుధవారం) మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు మంచు విష్ణు కూడా ఉన్నారు.

ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఆసక్తి వివాదాలు తారస్థాయికి చేరాయి. తండ్రికొడుకులు ఒకరినొకరు కొట్టుకోవడం, దూషించుకోవడం వరకు వచ్చింది. ఇంట్లో ఘర్షణ పడ్డ వీరు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆ తర్వాత మనోజ్‌ తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మోహన్‌ బాబు తన కుమారుడు మనోజ్‌ తనపై దాడి చేశాడని, అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాల మధ్య మంచు విష్ణు విదేశాల నుంచి ఇంటికి వచ్చారు. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసంలో ముగ్గురు చర్చించుకున్నారు. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన మనోజ్ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి జల్‌పల్లి నివాసంపై దాడి చేశాడు. గెటు పగలగోట్టి ఇంట్లోరి చొరబడ్డాడు. మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదరడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మీడియా ప్రతినిథిలు కూడా అక్కడికి చేరుకున్నారు. మోహన్‌ బాబు బౌన్సర్లు, మనోజ్.. అతడి అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మోహన్‌ బాబు ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించడంతో.. ఏం చెప్పాలి అని కెమెరా లాక్కుని దాడి చేశాడు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మీడియా దాడి చేయడంతో మోహన్‌ బాబు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెంటనే మోహన్‌ బాబు మీడియాకు క్షమాపణలు చెప్పాలని నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్‌ రావడంతో మోహన్‌ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం గమనార్హం.

Exit mobile version
Skip to toolbar