Site icon Prime9

Mohan Babu:ముందస్తూ బెయిల్‌ కోసం పటిషన్‌ – మోహన్‌ బాబుకు షాకిచ్చిన హైకోర్టు

HC Shock to Mohan Babu

సినీ నటుడు మోహన్‌ బాబుకు హైకోర్టు షాకిచ్చింది. జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు మంచు మనోజ్‌తో ఆస్తి వివాదంలో నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో మోహన్‌ బాబు మీడియా ప్రతినిథిపై దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మోహన్‌ బాబు తెలంగాణ హైకోర్టులో పటిషన్‌ దాఖలు చేశారు. అంతేకాదు ఈ కేసులో పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా అరెస్ట్‌ చేయకుండ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన పటిషన్‌లో విజ్ఞప్తి చేవారు.

అయితే తాజాగా ఆయన పటిషన్‌ను విచారించిన హైకోర్టును మోహన్‌ బాబు అభ్యర్థనను తొసిపుచ్చింది. ఆయన పటిషన్‌ విచారణను తదుపరి గురువారం వరకు వాయిదా వేసింది. కాగా జర్నలిస్ట్‌పై దాడిపై మోహన్‌ బాబు ఇవాళ క్షమాపణలు కోరుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. కొద్ది రోజులుగా తన ఇంట్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, తన ఇంటికి గేటు పగలగొట్టి ఒకేసారి 40 నుంచి 50 మంది ఇంట్లోకి చొరబడ్డారని, ఆ ఒత్తిడిలో సహనాన్ని కోల్పోయిన తాను అనుకొని పరిస్థితుల్లో మీడియా ప్రతినిథిని గాయపరిచానని పేర్కొన్నారు.

ఈ విషయమైన తాను పశ్చాత్తాపడుతున్నానని తనని క్షమించాలని లేఖలో కోరారు. ఒత్తిడితో గందరగోళానికి గురైన నా ముందుకు మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. అప్పటికే అలసిపోయి ఉన్న నేను అనుకొని పరిస్థితుల్లో జర్నలిస్ట్‌ సోదరుడిని గాయపరిచాను. ఈ విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను. అతడికి, అతడి కుటుంబానికి ఇబ్బంది కలిగించినందుకు నా హృదయపూర్వంగా క్షమాపణలు కోరుతున్నా. టీవీ9 రిపోర్టర్‌ రంజిత్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా” అంటూ లేఖలో రాసుకొచ్చారు. కాగా గత వారంలో రోజులుగా మంచు ఫ్యామిలీలు గొడవలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Exit mobile version