Site icon Prime9

Mmts Trains: హైదరాబాద్ నగర వాసులకు గమనిక.. రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

MMTS TRAINS

MMTS TRAINS

Mmts Trains: మరమ్మతుల కారణంగా రెండు రోజులు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని తెలిపింది.

నేడు, రేపు ఎంఎంటీఎస్(Mmts Trains) సేవలను రద్దు చేసినట్లు.. దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ ప్రకటన చేశారు. లింగంపల్లి-నాంపల్లి దారిలో 2 రైళ్లు.. నాంపల్లి-లింగంపల్లి మార్గంలో 3 రైళ్లను రద్దు చేశామన్నారు. అలాగే ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గమధ్యంలో 5 సర్వీసులను రద్దు చేశామని తెలిపారు.

ఆ రూట్లలో ఎంఎంటీఎస్(Mmts Trains)  రైళ్లు రద్దు..

ఇక మరోవైపు.. లింగంపల్లి- ఫలక్‌నుమా మార్గంలో 6 సర్వీసులను రద్దు చేశామన్నారు. రాంచంద్రాపురం-ఫలక్‌నుమాలో 1, ఫలక్‌నుమా- రాంచంద్రాపురం మార్గంలో ఒక సర్వీసును నిలిపివేసినట్లు తెలిపారు. ఇక ఇదే దారిలో ఫలక్‌నుమా- నాంపల్లి మార్గంలో మరో సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. మొత్తం నగరవ్యాప్తంగా 19 సర్వీసులను నిలిపివేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు తప్పనిసరిగా గమనించాలని కోరారు.

మరో వైపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 21 టికెట్ కౌంటర్లను దక్షిణ మధ్య రైల్వే తెరిచింది. పండగ సందర్భంగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండగా.. ఇప్పుడు వీటిని 33 పెంచినట్లు తెలిపింది. పండగ నేపథ్యంలో ప్రతి రైల్వే స్టేషన్ లో అదనపు సిబ్బందిని.. అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version