MLC Elections Notification: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది.
ఈ రెండు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో 3 పట్టభద్రులు, 2 టీచర్ ఎమ్మెల్సీ, 8 స్థానిక సంస్థల స్థానాలు, తెలంగాణలో 1 టీచర్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29 తో ముగియనుంది.
స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేసే సభ్యుల పదవీ కాలం మే 1 వరకు ఉంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
ఏపీలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు (MLC Elections Notification)
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు
కడప – అనంతపురం – కర్నూలు
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు
ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు
కడప- అనంతపురం- కర్నూలు
శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు
అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణలో.. (MLC Elections Notification)
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం. హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరుగుతాయి.
షెడ్యూల్ వివరాలు (MLC Elections Notification))
ఎన్నికల నోటిఫికేషన్ – ఫిబ్రవరి 16
నామినేషన్లకు చివరి తేది – ఫిబ్రవరి 23
పరిశీలన – ఫిబ్రవరి 24
విత్ డ్రాలు – ఫిబ్రవరి 27
పోలింగ్ – మార్చి 13
కౌంటింగ్ – మార్చి 16
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/