MLA Raghunandan Rao: ఖమ్మం సభకు డబ్బులు ఎక్కడివి.. 4 వేల కోట్ల భూముల కోసమే తోట BRSలో చేరాడు

MLA Raghunandan Rao: సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మియాపూర్ లోని రూ. 4 వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు. సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కాం జరుగుతోందన్నారు.

BRS అంటే బీహార్ రాష్ట్ర సమితి అని .. కేసీఆర్ బీహారీ.. ఆయనకు బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్ పైన ప్రేమ ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

సుప్రీం కోర్టు కు వెళతాం

భూ స్కామ్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర ఉందని తెలిపారు. ఎంబీఎస్ జువెలర్స్ సుఖేష్ గుప్తా వ్యవహారం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి కలెక్టర్.. తోట చంద్రశేఖర్ వ్యవహారంలో సుప్రీం ను ఎందుకు ఆశ్రయించలేదని ఆయన ప్రశ్నించారు.

క్విడ్ ప్రో కో జరుగుతోందని .. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. భూ దందా కోసమే ప్రమోట్ ఐఏఎస్ లను హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల కు కలెక్టర్ లుగా నియమించారన్నారు.

ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. కేసీఆర్ కు గతంతో దొంగలుగా కనిపించిన ఆంధ్రోళ్లు.. ఇవాళ ఆప్తులగా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు.

4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కు కట్ట బెడుతున్నారు. తోట చంద్రశేఖర్ చేత BRS సభకు ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలు

మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదకగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి గుళ్లు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆరోపించారు.

యాదాద్రి అభివృద్ధి పెట్టుబడి అని.. హుండీల్లో భక్తుల ముడుపులు రాబడి అని ట్విటర్ టిల్లు (మంత్రి కేటీఆర్) చెబుతున్నారన్నారు.

మన హిందూ దేవాలయాలను పెట్టుబడుల అవకాశాలని చూపించేందుకే కేసీఆర్ బీఆర్‌ఎస్ ఖమ్మం సమావేశానికి ముందు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/