Site icon Prime9

Minister KTR: గుజరాతీ చెప్పులు నెత్తిన పెట్టుకునే వ్యక్తికి తెలంగాణ ఆత్మాభిమానమా: కేటీఆర్

KTR

KTR

Minister KTR: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోమారు బీజేపీ పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటెల రాజేందర్ అన్నారని.. ఈటెల అనే వ్యక్తిని పరిచయం చేసింది కేసీఆర్ కాదా ఆయన ప్రశ్నించారు.

ఈటెలకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్ అని.. తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని కేసీఆర్ పాలన అరిష్టమని అనడం ఎంత సమంజసమన్నారు.

ఇది తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టు కాదా అని కేటీఆర్ అన్నారు. 14 నెలల కిందట హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ను గెలిపించారని.. ఈ 14 నెలల్లో ఏం అభివృద్ధి జరిగిందని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను తీసుకొచ్చి నిధుల వరద కురపిస్తానన్న మాటలు ఏమయ్యాయన్నారు.

ఎవరి పాలన ఈ దేశానికి అరిష్టమో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి తెలిపారు.

 

మోదీ వల్ల అదానీ బాగుపడ్డారు

మరోవైపు ప్రధాని మోదీ (PM Modi) వల్ల ఈ దేశంలో బాగు పడింది అదానీ ఒక్కరేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు.. జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామన్నారు.. కానీ చివరికి దేశ ప్రజల డబ్బు అంతా ఒక్కడి ఖాతాలోనే వేశారని విమర్శించారు.

మోదీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పంచుతోందన్నారు. మోదీ దేవుడని బండి సంజయ్ చెబుతున్నారని.. ఆయన ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడని కేటీఆర్ ప్రశ్నిచారు.

14 మంది ప్రధానులు చేసిన అప్పులు మోదీ ఒక్కరే చేశారని ఎద్దేవా చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పితే బండి సంజచ్ ఏం చేశారన్నారు.

పరిశ్రమలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర విద్యాసంస్థలు బండి సంజయ్ తెచ్చారా అని అన్నారు.

గుజరాతీ చెప్పులు నెత్తిన పెట్టుకునే వ్యక్తికి తెలంగాణ ఆత్మాభిమానం ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version