Site icon Prime9

Minister Harish Rao : ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలు అంటున్న మంత్రి హరీశ్ రావు.. ఎందుకంటే?

minister harish rao comments on kanti velugu scheme

minister harish rao comments on kanti velugu scheme

Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు.

కాగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతగా ‘కంటి వెలుగు’ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ పథకం ద్వారా 18 ఏళ్లు పైబడిన వారు అందరూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చు.

అధికార యంత్రాంగం, ప్రభుత్వ సిబ్బంది శిబిరాలు ఏర్పాటును పూర్తి చేశారు. 100 రోజుల పాటు ఈ శిబిరాలను ఉంచనున్నారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలను అందించనున్నారు. శని, ఆది వారాలు, సెలవు దినాలుగా ప్రకటించారు.

కాగా ఇందులో భాగంగా..

అవసరమైన వారికి కళ్లద్దాలు, ఔషధాలు పంపిణీ చేస్తారు.

అవసరమైన వారికి శస్త్రచికిత్స కూడా చేయిస్తారు.

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 241 ప్రాంతాల్లో కలిపి 5,058 శిబిరాలను ప్రభుత్వం నిర్వహించనుంది.

పరీక్షలు చేయించుకోవడానికి వచ్చేవారు ఆధార్‌ లేదా రేషన్‌ కార్డు వంటి ఏదో ఒక గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుంది.

అధికారులు పలు కేంద్రాల్లో ఇప్పటికే మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

మరోవైపు ఇంటింటికీ వెళ్లి ఏఎన్ఎంలు కంటి వెలుగు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు.

కాగా నేడు తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

కాంతి వెలుగు పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని హరీష్ రావు తెలిపారు.

గతంలో 8 నెలల్లో మొదటి విడత పూర్తి చేశామని.. ఇప్పుడు వంద రోజుల్లో రెండో విడత పూర్తి చేస్తామని వెల్లడించారు.

కాలనీకే కంటి వెలుగు బృందాలు వస్తాయని.. చివరి మనిషి వరకు కంటి పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చారు.

ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలు అని హరీష్ రావు అన్నారు.

తెలంగాణలోని ప్రతి పథకం దేశానికే దిక్సూచి లాగా మారాయని.. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయన్నారు.

ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఇక్కడ చూసి వాళ్ళ రాత్రల్లో కంటి వెలుగు అమలు చేస్తామని చెప్పారు

మెడిన్ తెలంగాణ అద్దాలు ఈ సారి పంపిణీ చేయనున్నామన్నారు.

సంగారెడ్డిలోనే కంటి అద్దాలు తయారుకావడం ఈసారి ప్రత్యేకంగా పరిగణించారు.

పార్టీలకు అతీతంగా కంటి వెలుగుని విజయవంతం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version
Skip to toolbar