Site icon Prime9

Andhra Pradesh: సీడ్స్ కంపెనీలో విషవాయువు లీక్ పై సర్కార్ సీరియస్.. యూనిట్ మూసివేతకు ఆదేశాలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ లో ఉన్న సీడ్స్‌ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకై అస్వస్థకు గురైన బాధితులు కోలుకుంటున్నారన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు. సీడ్స్‌ కంపెనీ మూసేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటన పై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామని, సీడ్స్‌ కంపెనీకి నోటీసులు ఇచ్చామని, తప్పు జరిగితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనని తెలిపారు. ఇదే కంపెనీలో అంతకుముందు కూడా గ్యాస్‌ లీకైందని మంత్రి వెల్లడించారు. అప్పుడు ఏసీ డెక్‌లలో క్రిమి సంహారక మందులు కలవడం వల్ల కాలుష్యం లీకై గ్లోరి ఫై పాలీస్‌ అనే రసాయనం వెలువడినట్లు తెలిసిందని వివరించారు. ఈసారి కారణం నిర్ధారణ కావాల్సి ఉందని అన్నారు. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్‌ లేకపోతే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు నమూనాలు పంపుతున్నామని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు.

Exit mobile version