Site icon Prime9

Hyderabad Metro: సాంకేతిక లోపం… 30 నిమిషాలు పాటు ఆగిపోయిన మెట్రో రైలు సేవలు

Metro train services halted for 30 minutes due to technical glitch

Hyderabad Metro: భాగ్యనగరంలో తెల్లారితే చాలు, ఉరుకులు పరుగులు మీద తమ తమ గమ్యస్ధానాలకు చేరుకొనే సామాన్యులు, ఉద్యోగుల రద్దీతో ప్రధాన మార్గాలు కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో ప్రజలు రోడ్డు, మెట్రో రైలు సేవలను అధికంగా వినియోగిస్తుంటారు. అయితే నేడు ఉదయం చోటుచేసుకొన్న సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు సేవలు ఆగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు.

మియాపూర్-ఎల్బీ నగర్ వైపు రాకపోకలు సాగించే మెట్రో రైలు ఉదయం సమయంలో మొరాయించింది. దీంతో 30నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి. సేవల్లో అంతరాయం కల్గడంతో ఆయా మార్గాల్లో వెళ్తున్న రైళ్లను ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్ పేట్ తదితర స్టేషన్లలో ఆపివేశారు. కొన్ని రైళ్లు మార్గం మద్యలోనే ఆగిపోయాయి.

రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళన చెందారు. కొద్ది సేపటికి రైలు సేవలను పునరుద్ధరిస్తామని మెట్రో సిబ్బంది అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో 40 నిమిషాల అనంతరం మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైనాయి. ఈ విషయం కాస్తా ప్రజలకు తెలియడంతో పలువురు రోడ్డు మార్గాన్ని ఎంచుకొన్నారు. దీంతో కెపిహెచ్బి-పంజాగుట్ట వైపు భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలు సిగ్నల్స్ వద్ద వాహనాల రద్దీతో తీవ్ర జాప్యం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Vande Bharat Express : దక్షిణాదిన మొదటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Exit mobile version