Site icon Prime9

Actress Kushbu : జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఖుష్బూ.. ఆ ప‌ద‌వికి ఆమె అర్హురాలు అంటున్న చిరంజీవి

megastar chiranjeevi wishes to kushbu about national women commisiion

megastar chiranjeevi wishes to kushbu about national women commisiion

Actress Kushbu : ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రిలో కుష్బూకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టారంటేనే అర్దం చేసుకోవచ్చు.. కుష్బూ ఫాలోయింగ్ ఏంటో. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన ఈమె.. పలు హిట్ లను తన ఖాతాలో వేసుకొని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. చివరిగా తెలుగులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి,  రజినీకాంత్ పెద్దన్న సినిమాల్లో కనిపించారు.

ప్రస్తుతం సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తూనే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు కుష్బూ. అయితే తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఆమెకు కీల‌క ప‌ద‌విని ఇచ్చారు. జాతీయ మ‌హిళా కమిషన్ స‌భ్యురాలిగా ఆమె నామినేట్ అయ్యారు.  ఈ ప‌ద‌విలో ఆమె మూడేళ్ల పాటు సేవ‌ల‌ను అందించ‌బోతున్నారు. ఖుష్బూకి ఇంత మంచి ప‌దవి రావ‌టంపై ఆమె స‌న్నిహితులతో పాటు సినీ ప్ర‌ముఖులు సైతం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ఖ‌ష్బూ సుంద‌ర్‌కి ట్విట్ట‌ర్ వేదికగా అభినంద‌న‌లు తెలిపారు.

వారి గొంతుక మ‌రింత శ‌క్తివంతం – చిరంజీవి (Actress Kushbu)

ఈ మేరకు ఆ పోస్ట్ లో..  ‘‘ఖుష్బూ సుందర్‌కి అభినంద‌న‌లు. క‌చ్చితంగా ఆ ప‌ద‌వికి ఆమె అర్హురాలు. జాతీయ మ‌హిళా క‌మీష‌న్ స‌భ్యురాలిగా ఎంపికైన ఆమె వ‌ల్ల మ‌హిళ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ఎక్కువ దృష్టి పెరుగుతుంది. వాటి ప‌రిష్కారాల‌ను కూడా స‌మ‌ర్ద‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న వారి గొంతుక మ‌రింత శ‌క్తివంతంగా మారుతుంది’’ అని అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ఖుష్బూ, చిరంజీవి క‌లిసి స్టాలిన్ సినిమాలో న‌టించారు. రీసెంట్‌గా ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు కుష్బూకి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

 

 

జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నామినేట్‌ చేయడంపై ఖుష్బూ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ‘నాకు ఇంత గొప్ప బాధ్యతను అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికీ కృతజ్ఞతలు’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మోదీ నాయకత్వంలో నారీశక్తిని పరిరక్షించేందుకు తన వంతుగా కష్టపడి పనిచేస్తానని ఈ సంద‌ర్బంగా ఆమె తెలియ‌జేశారు.

మరోవైపు శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్‌ రామబాణం అనే సినిమాలో నటిస్తున్నాడు.  ఈయన కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భూపతిరాజా రాసిన ఈ కథను శ్రీవాస్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ద్వారా ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ కథగా రివీల్ చేయగా.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో గోపిచంద్ జోడీగా డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించనుండగా.. ఓ కీలక పాత్రలో ఖుష్బు నటించనున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version