Site icon Prime9

Waltair Veerayya : బాస్ బాక్సాఫీస్ ఊచకోత.. వాల్తేరు వీరయ్య @200 కోట్లు.. ఏకంగా 10 రోజుల్లోనే

megastar chiranjeevi waltair veerayya collected 200 crores in 10 days

megastar chiranjeevi waltair veerayya collected 200 crores in 10 days

Waltair Veerayya : మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.

ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది.

సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటోంది.

విడుదలైన తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన వాల్తేరు వీరయ్య సినిమా తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది.

200 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)..

బాక్సాఫీసు వద్ద 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దుమ్ము లేపుతుంది ఈ చిత్రం.

ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు ట్విట్టర్ అకౌంట్ లో మెగాస్టార్‌ చిరంజీవి కొత్త పోస్టర్‌కు కూడా రిలీజ్‌ చేసింది.

కాగా మెగాస్టార్ కెరీర్ లో రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మూడో సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది.

అంతకు ముందు ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి.

మరోవైపు యూఎస్ బాక్సాఫీస్‌ను కూడా వాల్తేరు వీరయ్య చిత్రం షేక్ చేస్తుంది.

 

 

 

మరోవైపు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ ని కొల్లగొడుతూ దూసుకుపోతుంది.

ఈ సినిమాను అమెరికాలో శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేసింది.

ఇప్పటి వరకు అమెరికాలో ఈ చిత్రం 2.25 మిలియన్ల కలెక్షన్లు రాబట్టినట్లు శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది.

సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్‌- మాస్‌ మహారాజా కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి.

ఇక శ్రుతిహాసన్‌ అంద చందాలు, క్యాథరిన్‌ థెరిస్సా అభినయం సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి మరో యాడ్ ఆన్ లాగా మారింది,

అన్నయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించిన రవితేజ మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవితో స్క్రీన్ పంచుకున్నారని అంటున్నారు.

మళ్లీ వారిద్దరినీ సిల్వర్ స్క్రీన్‌పై కలిసి చూడటం కన్నుల పండుగగా ఉందంటున్నారు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోస్ అయిన ఈ ఇద్దరూ కలిసి నటించిడం పట్ల ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హ్యాప్పీ అవుతున్నారు.

ఈ సినిమాతో ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం చూస్తున్న మెగాస్టార్ కి సూపర్ విక్టరీ దక్కిందని మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు అనూహ్య స్పందన వస్తోంది.

ఈ సినిమా చూశాకా 80, 90 దశకాల అభిమానులకి పాత చిరంజీవి గుర్తుకు వస్తున్నారు అని అభిమానులు అంటున్నారు.

 

 

Exit mobile version