Site icon Prime9

Megastar Chiranjeevi : “రంగమార్తాండ” మూవీ ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది – చిరంజీవి

megastar chiranjeevi post about rangamarthanda movie goes viral

megastar chiranjeevi post about rangamarthanda movie goes viral

Megastar Chiranjeevi : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ‘రంగమార్తాండ‘ .. ‘మన అమ్మానాన్నల కథ’ అనేది ఉపశీర్షిక. అలానే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు రాయగా.. లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజ్య శ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఉగాది కానుకగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి ‘రంగమార్తాండ’ వచ్చింది. ఈ నెల 22న విడుదలయిన ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.

ముఖ్యంగా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ నటించడం కాదు జీవించేశారని అందరూ ప్రసంసిస్తున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాని ప్రసంసిస్తున్నారు. కాగా తాజాగా ఇప్పుడీ సినిమా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాని వీక్షించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ సినిమా ఆయన హృదయాన్ని కదిలించిందని చిరు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ లో..

రంగమార్తాండ త్రివేణీ సంగమంలా అనిపించింది – చిరంజీవి (Megastar Chiranjeevi)

”నేను ‘రంగమార్తాండ’ చూశాను. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటి. ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఈ సినిమా ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వాటి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

అలానే బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చేయడం తొలిసారి అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. సెకండ్ హాఫ్ అంతా అప్రయత్నంగానే కంట తడి నిండిందని ఆయన తెలిపారు. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇటువంటి సినిమాలు అందరూ తప్పకుండా చూసి ఆదరించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. కృషవంశీ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ..చిత్ర బృందం అందరికీ ఆయన అభినందలు తెలిపారు. కాగా ఇటీవలే బ్రహ్మానందం నటించిన పాత్రకు మంచి పేరు రావడంతో ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో కూడా ఫుల్ గా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Exit mobile version