Site icon Prime9

Megastar Chiranjeevi : పుత్రోత్సాహంలో మెగాస్టార్ చిరంజీవి.. ఇది ఇండియన్ సినిమా గర్వించాల్సిన క్షణం అంటూ !

megastar chiranjeevi post about ram charan goes viral

megastar chiranjeevi post about ram charan goes viral

Megastar Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో కూడా పాల్గొన్నారు. కాగా ఈ టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి తెలుగు హీరో, ఇండియన్ స్టార్ ఆయనే. ఈ విషయంలో చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. తాజాగా చరణ్ ఈ షోలో పాల్గొనగా.. ముగ్గురు యాంకర్లు చరణ్ తో చిట్ చాట్ చేశారు. ముందుగా గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొనడానికి చరణ్ స్టూడియో వెళ్లగా.. బయట పెద్ద సంఖ్యలో అభిమానులు మెగా పవర్ స్టార్ కోసం ఎదురుచూశారు. వారందరికి రాంచరణ్ సెల్ఫీలు ఇచ్చాడు.

మాస్టర్ మైండ్ రాజమౌళికి కృతజ్ఞతలు – చిరంజీవి (Megastar Chiranjeevi)

ఈ సందర్భంగా చిరంజీవి తన పుత్రోత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇండియా తరుపు నుంచి రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం ఇది. ఇటువంటి అవకాశాన్ని తీసుకువచ్చిన మాస్టర్ మైండ్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అలానే నిన్న( ఫిబ్రవరి 22 ) ఉపాసన చిన్నమ్మ సంగీతారెడ్డి.. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అల్లుడు’ అంటూ ట్వీట్ చేసింది.

అలానే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ కి రామ్‌ చరణ్ ని ప్రజెంటర్ గా ఆహ్వానించారు. ఈ అవార్డ్స్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ టాక్ షో లో ఇప్పటి వరకు అవెంజర్స్ టీమ్, మార్వెల్ సిరీస్ హీరోలు, టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ టాప్ హీరోలు షోలో సందడి చేశారు. గ్రే బ్లేజర్, మ్యాచింగ్ ట్రౌజర్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే బ్రౌన్ షూస్.. సన్ గ్లాసెస్ తో ఫుల్ స్మార్ట్ లుక్ లో అదిరిపోయాడు చెర్రీ.

రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు చరణ్. హాలీవుడ్ ఆడియన్స్ నుంచి మూవీ టెక్నీషియన్స్ వరకు చరణ్ నటనకి ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మరోవైపు ఆస్కార్ 2023 కోసం పోటీ పడుతుంది. ఇక ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. టాప్ గన్.. మావెరిక్, బుల్లెట్ ట్రైన్, ది అన్ బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్, ది ఉమెన్ కింగ్ చిత్రాలతోపాటు.. ఉత్తమ యాక్షన్ సినిమా విభాగంలో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నామినేట్ అయ్యారు. ఈ అవార్డ్స్ విజేతలను మార్చి 16న ప్రకటించనున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version