Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “వాల్తేరు వీరయ్య’.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది.
ఇప్పటికే ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ప్రాఫిట్స్ తో అదరగొడుతుంది.
విదేశాల్లో కూడా వాల్తేరు వీరయ్య సినిమా రికార్డు వసూళ్లు కలెక్ట్ చేస్తుంది.
తాజాగా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్ కూడా రావడం మెగా అభిమానులకు డబుల్ బొనాంజాలా అనిపించింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ గురించి చిరు (Megastar Chiranjeevi) ఏమన్నారంటే..?
రవితేజని చూస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నట్టే ఉంటుందని, అప్పట్లో ఇద్దరూ ఒకేలా ఉండేవారని తెలిపారు.
రవిలో నా తమ్ముడిని చూసుకున్నానని తెలిపారు. ముఖ్యంగా సినిమాలో రవితేజ పాత్ర చనిపోయినప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించిందన్నారు.
ఆ టైమ్‌లో రవితేజ స్థానంలో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని ఊహించుకున్నానని, అందుకే ఆటోమెటిక్ గా తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు.
గ్లిజరిన్ వాడకుండానే ఆ సీన్ చేయగలిగానని తెలిపారు. దీనిపై తనకు దర్శకుడు, నిర్మాతలు, ఇతర టీమ్ నుంచి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయని చెప్పారు.
ఈ సినిమా తీస్తున్నప్పుడే హిట్ అవుతుంది అనుకున్నాము.
కానీ ఈ రేంజ్ లో ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు.
ఈ సినిమా నాన్ బాహుబలి, నాన్ RRR స్థాయిలో హిట్ అయి కలెక్షన్స్ ని తీసుకొస్తుంది.
వాల్తేరు వీరయ్య సినిమా నాన్ రాజమౌళి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇంతటి సక్సెస్ ఇచ్చినందుకు ఈ సక్సెస్ అగ్ర తాంబూలం ప్రేక్షకులకే. నాకు మళ్ళీ ఇంతటి భారీ సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.
చరణ్ ని చూస్తుంటే నాకే ఆస్కార్ వచ్చినంత ఆనందంగా ఉంది – చిరు
రామ్ చరణ్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన RRR సినిమా ఆస్కార్ దాకా వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకే ఆస్కార్ వచ్చినంత ఆనందంగా ఉంది అని తెలిపాడు.
983లో ఖైదీ సినిమా నన్ను స్టార్ హీరోని చేసింది. ఇప్పుడు 2023లో వాల్తేరు వీరయ్య సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ చేసింది.
బాబీ చాలా కష్టపడ్డాడు.. కష్టపడేవాడికి సక్సెస్ ఎప్పుడూ వస్తుంది. సినిమా చివరిదాకా కష్టపడుతూనే ఉన్నాడు.
అతని కష్టం, అతనికి సినిమా మీద ఉన్న ప్రేమ, అతని పట్టుదల చూసి నాకు ముచ్చటేసింది.
బాబీ నా అభిమాని అని చెప్తుంటాడు. కానీ అతని కష్టం చూసి నేను బాబీకి అభిమానిని అయ్యాను.
తక్కువ డేట్స్ లో ఇచ్చిన బడ్జెట్స్ లో సినిమా తీశాడు. అసలు ఎక్కడా ఏది వేస్ట్ చేయలేదు.
డైరెక్టర్స్ ఇదే నేర్చుకోవాలి. సినిమాలో వేస్టేజ్ ఎక్కువ షూట్ చేయకుండా ఏదున్నా పేపర్ మీదే మార్పులు చేర్పులు చేసుకోవాలి.
నిర్మాతలకి సపోర్ట్ గా ఉండాలి డైరెక్టర్. వచ్చే యంగ్ డైరెక్టర్స్ బాబీ లాంటి దర్శకుల వద్ద ఇవన్నీ చూసి నేర్చుకోవాలి అని అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/