Megastar Chiranjeevi Help : టాలీవుడ్ లో పెద్ద పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న వారందరికీ మెగా ఫ్యామిలీ ఎన్నో సందర్భాల్లో సాయంగా నిలబడింది. సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసరాలు హెల్త్ కిట్స్ వ్యాక్సిన్స్ పంపిణీ చేశారు. ఇవే కాకుండా సినీ జర్నలిస్టులకు ఎన్నో విధాలుగా సాయపడ్డారు. చిరు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడుతోన్నారు. సాయం బయటకు చెప్పకుండా మరెంతో మందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటుంది మెగా ఫ్యామిలీ. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిరుపేదల గొప్ప సినీ ప్రొడ్యూసర్ల వరకు ఆయన సేవాహృదయాన్ని కొనియాడని వారుండరు. అభిమానులకు కూడా ఎంతో మందికి అండగా నిలిచారు మెగాస్టార్.. నిలుస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అక్కర్లేదు అని చెప్పవచ్చు.
తాజాగా చిరంజీవి ఓ ప్రముఖ నటుడికి సాయం చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. తమిళ నటుడు పొన్నాంబళం గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. పొన్నాంబళం తనకి ఆర్థిక సాయం అందించాలని కూడా గతంలో విజ్ఞప్తి చేశాడు. పొన్నాంబళంకి పలువురు ఆర్థిక సాయం అందించినప్పటికీ అది అతడి వైద్య ఖర్చులకు సరిపోలేదు. ప్రస్తుతం పొన్నాంబళం పూర్తిగా కోలుకుని నార్మల్ అయ్యారు.
ఆయన చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేను – పొన్నాంబళం (Megastar Chiranjeevi Help)
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే తనకు వైద్యం అందింది అని.. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం మరచిపోలేని అని పొన్నాంబళం అన్నారు. తన స్నేహితుడి ద్వారా పొన్నాంబళం చిరంజీవి ఫోన్ నంబర్ తీసుకున్నారు. ‘అన్నయ్య నేను పొన్నాంబళం. నా ఆరోగ్యం బాగాలేదు.. వీలైన సాయం చేయండి’ మెసేజ్ చేసి రిక్వస్ట్ చేశారట. పది నిమిషాల తర్వాత అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది. హాయ్ పొన్నాంబళం.. ఏంటి నీ ఆరోగ్యం బాగాలేదా.. హైదరాబాద్ కి రాగలవా వైద్యం చేయిస్తాను అని అడిగారు. నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పాను. అయితే వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళు.. మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పారట.
నేను ఆసుపత్రికి వెళితే కనీసం నన్ను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదు. మొత్తం వాళ్లే చూసుకుని వైద్యం చేశారు. వైద్యానికి రూ 45 లక్షలు ఖర్చు అయింది. అంతా చిరంజీవి అన్నయ్యే భరించారు అంటూ పొన్నాంబళం ఎమోషనల్ అయ్యారు. ఆ ఆసుపత్రి రాంచరణ్ గారి సతీమణి ఉపాసన గారిదే కావడంతో నన్ను ఇంకా బాగా చూసుకున్నారు అంటూ పొన్నాంబళం తెలిపారు. చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు , ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్ లాంటి చిత్రాల్లో పొన్నాంబళం నటించారు. ఈ వార్త బయటికి రావడంతో చిరంజీవి గొప్పతనాన్ని మరోసారి పొగుడుతూ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.