Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినీ నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 27న కుప్పంలో నందమూరి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
వెంటనే ఆయనకు కుప్పంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన వైద్య కోసం బెంగళూరుకు తరలించారు.
ప్రస్తుతం ఆయనకు నిపుణులైన డాక్టర్లతో కూడిన వైద్య బృందం చికిత్సను అందిస్తోంది.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. గుండె స్పందిస్తుందని వైద్యులు వెల్లడించారు.
డాక్టర్లకి, భగవంతుడికి కృతజ్ఞతలు : చిరంజీవి (Megastar Chiranjeevi)
ఈ క్రమంలో తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ మేరకు ట్విట్టర్ లో.. ‘‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుండి తారకరత్నను కాపాడిన ఆ డాక్టర్లకి, భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్ తారకరత్న’’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇది ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.May you have a long and healthy life dear Tarakaratna!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023
ఇక తారకరత్న ఆరోగ్యం విషయంలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దన్నారు నందమూరి రామకృష్ణ.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “తారకరత్న ట్రీట్మెంట్‌కు స్పందిస్తున్నాడు. మునుపటితో పోలిస్తే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా మెరుగుపడింది. తారకరత్న శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయి.
గుండె, లివర్ వంటి అవయవాల పని తీరు సాధారణ స్థితికి వచ్చింది.
మంచి వైద్యుల బృందం తారకరత్నకు వైద్యం అందిస్తోంది.
త్వరలోనే తారకరత్న కోలుకుని మనముందుకు వస్తాడు. ఆయన ఆరోగ్య బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అన్నారు నందమూరి రామకృష్ణ.
కాగా ఇటీవల తారక రత్నను చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరు వచ్చారు.
ఆ సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ..
27వ తేదీన దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుందని అన్నారు.
తన అన్న తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆయనకు అభిమానుల ఆశీర్వాదం, తాత ఆశీర్వాదం ఉందన్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అందరూ ప్రార్థనలు కొనసాగించాలని, అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు.
కర్ణాటక హెల్త్ మినిస్టర్, తనకు ఆప్తులైన సుధాకర్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా తెలిపారు.
ఆయన కూడా ఈ పరిస్థితుల్లో తన వంతు సాయం అందిస్తున్నారని చెప్పారు. తాను తారకరత్నను చూశానని.. ఆయన స్పందిస్తున్నారని.. మంచి వైద్యం అందుతుందని తెలిపారు.
మరో ఇద్దరు వైద్యులను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు.. అలాగానీ క్రిటికల్ కండీషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా కాదన్నారు.
అయితే చికిత్సకు స్పందిస్తున్నారని.. ఇది మంచి పరిణామని తెలిపారు. ఎక్మో సాయంలో తారకరత్న లేరని అన్నారు.
కుటుంబ సభ్యునిగా తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. డాక్టర్లు తనకు ధైర్యం ఇచ్చారని.. అదే ధైర్యాన్ని తాను అభిమానులకు చెబుతున్నానని అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/