Site icon Prime9

Megastar Chiranjeevi : పెద్దరికం అనుభవించాలనే కోరిక లేదన్న మెగాస్టార్ చిరంజీవి… వాళ్ళకు నవ్వుతూ కౌంటర్!

megastar-chiranjeevi-comments-about-industry-pedda-goes-viral

megastar-chiranjeevi-comments-about-industry-pedda-goes-viral

Megastar Chiranjeevi : హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. సినీ కార్మికుల కోసం ఈ గృహాలను నిర్మించారు. 22 ఏళ్ళ సినీ కార్మికుల కల ఇవాళ నిజం కాబోతుండడంతో, చిత్రపురిలో సంబరాలు నెలకొన్నాయి. ఇక ఈ కార్యక్రమానికి అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. “సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో ఈరోజు నేను కాస్త బిజీగా ఉన్నాను. దాంతో ఈ కార్యక్రమానికి రాలేనని చెబుదామనుకున్నా. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున చిత్రపురి కాలనీకి శంకుస్థాపన జరిగిందని… అందుకే ఇదే రోజున ఈ గృహ సముదాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని చైర్మన్ అనిల్ దొరై చెప్పారు. ఆయన చెప్పిన మాట విన్నాక ప్రోగ్రామ్స్ అన్నింటినీ వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చానన్నారు. సినీ కార్మికులకు సైతం సొంత ఇల్లు ఉండాలనేది ఒక పెద్ద కల. ఆ కల సాకారం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు అని తెలిపారు.

ఈ సందర్భంగా మనం డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డిని గుర్తు చేసుకుని ఆయనకు నివాళులు అర్పించాలి. ఆయన సుదీర్ఘ ఆలోచన నేడు సాకారమైంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలుగు లోనే సినీ కార్మికులకు ఇటువంటి గృహ సముదాయం ఉంది. ఈ గృహ సముదాయాన్ని నిర్మించడం కోసం కమిటీని ఏర్పాటు చేయగా మధ్యలో ఏవో అవకతవకలు. జరిగాయన్నారు. దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి దానిపై మాట్లాడను అని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు. మీకెప్పుడూ ఏ అవసరం వచ్చినా సరే నేను ముందు ఉంటాను అని హామీ ఇచ్చారు. సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ నన్ను ప్రతిసారీ పెద్ద అని చెబుతుంటారు. వాళ్లు నాకంటే చిన్నవాళ్ళు అనిపించుకోవడం కోసం నన్ను పెద్ద అంటున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

అలాగే సినీ కార్మికులు, కళాకారులు నాకు కుటుంబసభ్యులతో సమానం. వాళ్లకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటాను. సినీ పెద్ద అనే సీట్ మీద కూర్చొని, అలా ఒక పెద్దరికం అనుభవించాలని నాకు లేదు. భగవంతుడు నేను అనుకున్న దానికంటేడు నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు దానిలో కొంతభాగాన్ని ఏదో ఒకరకంగా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నా… కాబట్టి మళ్ళీ నాకు ఇప్పుడు ఈ పెద్దరికరం అనే ఒక హోదా వద్దు అంటూ చిరంజీవి వెల్లడించాడు. ప్రస్తుతం చిరు చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Exit mobile version