Site icon Prime9

Manikkam Thakur : నేను కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టా.. అరెస్ట్ చేయండి.. పోలీసులకు మాణిక్కం ఠాకూర్ ఛాలెంజ్

Manikkam Thakur

Manikkam Thakur

Manikkam Thakur : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ చ తప్పుబట్టారు. ఆయన కార్యాలయంలో 50 కంప్యూటర్లను పోలీసులు ఎ్తతుకెళ్లారని , కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని అన్నారు. ఇప్పుడు తాను కూడా అవే పోస్టింగులు చేస్తున్నానని తనను కూడా అలాగే అరెస్టు చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు మాణిక్కం ఠాకూర్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్​ పార్టీ రాజకీయ వ్యూహకర్త ​సునీల్ కార్యాలయంలో సోదాలు జరిగాయి. సీఎం కేసీఆర్​ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోదాల సందర్భంగా సునీల్​ కార్యాలయంలోనికంప్యూటర్లు, ల్యాప్​ టాప్​ లు స్వాధీనం చేసుకున్నారు. సునీల్​ కనుగోలు టీమ్​ గత కొంత కాలంగా కాంగ్రెస్ కోసం పని చేస్తూ ఉంది.

సునీల్​ కనుగోలు కార్యాలయం నుంచి ఫేక్ సోషల్​ మీడియా ప్రొఫైల్స్​ తో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్​ మీడియా పోస్టులు పెడుతున్నారని పోలీసులు చెప్పారు. ​తమ దగ్గర ఐదారు ఎఫ్​ఐఆర్​ లు ఉన్నాయని.. వాటి ఆధారంగా సోదాలకు వచ్చామని అన్నారు. సోదాలకు వచ్చేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు అన్నారు.

నేడు రాష్ట్ర  వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు…

ఇలా ఉండగా కాంగ్రెస్ వార్ రూమ్ పైన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనకు ప్లాన్ చేశారు. అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేయలని డిసైడ్‌ అయ్యారు. సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అటు మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులను గృహ నిర్బంధించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు మల్లు రవి. ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడుతారన్నారు

Exit mobile version
Skip to toolbar