Site icon Prime9

Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ – సమ్మర్‌లో సందడి

kannappa release date

Kannappa Release Date: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియాగా తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్‌ ఫ్యాక్టరి బ్యానర్‌పై మంచు మోహన్‌ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారగణం నటిస్తుండంతో ‘కన్నప్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను మొదట క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కన్నప్ప రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌ చేశారు. ఏప్రిల్‌ 25న సినిమాను విడుదల చేస్తున్నట్టు మూవీ టీం వెల్లడించింది. కన్నప్ప టైటిల్‌ రోల్‌లో మంచు విష్ణు నటిస్తుండగా.. ప్రభాస్‌, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ వంటి తదితర నటుటు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాతో విష్ణు తనయుడు అవ్‌రాం ఇండస్ట్రీ ఇస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటవల ఆయన ఫస్ట్‌లుక్‌తో పాటు పాత్రను కూడా పరిచయం చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన మహాదేవ శాస్త్రీ అనే పాత్రలో కనిపించనున్నాడు. కాగా ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషనల్‌ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar