Site icon Prime9

Manchu Family: మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు – నా ఇద్దరి కొడుకులకి ఆ హక్కు ఉంది, పోలీసులకు మోహన్‌ బాబు భార్య లేఖ

Mohan Babu Wife Nirmala Letter to Police: మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదటి మనోజ్‌, మోహన్‌ బాబులు పరస్పర ఆరోపణలుతో పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల అనుచరులతో దాడితో జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత మనోజ్‌ తన తన సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ ఇచ్చే నేపంతో ఇంటికి వచ్చి తన ఇంటి జనరేటర్‌లో చెక్కర వేసి విద్యుత్ సరఫరా నిలివేసినట్టు ఆరోపిస్తూ పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే మనోజ్‌ ఆరోపణలలో నిజం లేదంటూ వారి తల్లి,మోహన్‌ బాబు సతీమణి నిర్మలా మంచు పహాడీ షరీఫ్‌ పోలీసులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖలో సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతుంది.

మనోజ్‌ ఆరోపణలలో నిజం లేదు: నిర్మలా మంచు

ఆమె తన లేఖలో మనోజ్‌ ఆరోపణలో నిజం లేదని ఖండించారు. డిసంబర్‌ 14న నా పుట్టిన రోజు సందర్భంగా మా పెద్ద కుమారుడు విష్ణు కేక్‌ తీసుకుని జల్‌పల్లిలోని నివాసానికి వచ్చాడు. నాతో కాసేపు మాట్లాడి కేక్‌ కట్‌ చేయించి బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు. ఆ తర్వాత తన రూంలో ఉన్న సామాను తీసుకుని వెళ్లాడు. దీనికి నా చిన్న కుమారుడైన మంచు మనోజ్‌ ఇంటికి వచ్చిన విష్ణు సీసీటీవీ ఫుటేజ్‌ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అఖండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు.

ఈ ఇంటిపై మనోజ్‌కి ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది. విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్‌ ఇచ్చిన ఫిర్యాదులో ఏమాత్రం నిజం లేదు. అలాగే పనివాళ్లను కూడా బెదిరించలేదు. వారే తామిక్కడ పని చేయలేమని వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు. నా బర్త్‌డే సందర్భంగానే విష్ణు ఇంటికి వచ్చిన కేక్‌ కట్‌ చేయించి సెలబ్రేట్‌ చేసి ఆ తర్వాత రూంలోని తన సామాన్లు కొన్ని తీసుకువెళ్లాడు. అంతకుమించి ఇక్కడ జరిగింది ఏమి లేదు అని మీకు తెలియజేస్తున్నాను” అని నిర్మల మోహన్‌ బాబు తన లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె లేఖ నెట్టింట హాట్‌టాపిక్‌ మారింది. మరి దీనిపై మనోజ్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడనేది ఆసక్తిని సంతరించుకుంది.

మంచు మనోజ్‌ ఫిర్యాదు

“మా అన్నయ్య మంచు విష్ణు తన అనుచరులతో కలిసి డిసెంబర్‌ 14న మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు మా అమ్మ పట్టిన రోజుని అడ్డుపెట్టుకుని కేక్‌ తీసుకువచ్చే నేపంతో వచ్చి జనరేటర్‌లో చక్కెర పోయించాడు. దానికి వల్ల రాత్రి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి మేము చాలా ఇబ్బంది పడ్డాం. అంతేకాదు దానికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. విష్ణు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య. ఆ సమయంలో ఆ సమయంలో ఇంట్లో నా 9 నెలల కూతురు, మా అమ్మ, బంధువులు ఉన్నారు. వారంత ఇబ్బంది పడ్డారు. అలాగే విష్ణు తన అనుచరులతో కలిసి మా పనివాళ్లపై దౌర్జన్యం చేయడంతో వారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు” అని మనోజ్‌ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Exit mobile version