Site icon Prime9

Manchu Manoj: మా నాన్న దేవుడు – మీడియా ముందు కంటతడి పెట్టుకున్న మంచు మనోజ్‌

Manchu Manoj Talk With Media: మీడియా ముందు మంచు మనోజ్‌ కంటతడి పెట్టుకున్నాడు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు ఆవేదన వ్యక్తం చేశాడు. జల్‌పల్లిలోని మంచుటౌన్‌ నివాసం ముందు మనోజ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తండ్రి దేవుడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరయ్యాయి. ఆస్తి తగాదాలు రోడ్డెక్కాయి. ఈ క్రమంలో జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసంకు మనోజ్‌ తన అనుచరులతో ఇంటిపై దాడి చేశాడు.

ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక బలవంతంగా లోపలికి వెళ్లిన మనోజ్ చినిగిన చొక్కాతో బయటకు వచ్చాడు. అదే సమయంలో మోహన్‌ బాబు మీడియా ప్రతినిథిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం దీనిపై రచ్చ జరుగుతుంది. మోహన్‌ బాబుపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో తన తండ్రి మోహన్‌ బాబు, అన్నయ్య మంచు విష్ణు తరపున మీడియాకు మనోజ్‌ క్షమాపణలు చెప్పాడు.

నేను పిలవడం వల్లే మీడియా ఇక్కడకు వచ్చిందని, తన కోసం వచ్చిన వారిపై దాడి జరగడం బాధ కలిగించింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మా నాన్న పిలిస్తేనే తిరిగి ఇంటికి వచ్చాననన్నాడు. ఈ వివాదంలోకి నా భార్య, నా కూతురిని లాగుతున్నారు. మా నాన్న దేవుడు. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. భుజంపై తుపాకి పెట్టి కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. ఈ గొడవల వల్ల మా అమ్మ నలిగిపోతుంది. నిన్న ఆస్పత్రిలో చేరిందని అబద్ధం చెబుతున్నారు.

ఆమె మూడు రోజుల క్రితమే ఆస్పత్రికి వెల్లి వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆ తర్వాత మా అన్నయ్య ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంది. నాపై లేనిపోని నిందలు వేస్తున్నారు. నేడు దాడి చేశానంటూ అపబద్ధాలు చెబుతున్నారు. నా భార్యపై కూడా నిందలు వేస్తున్నారు. తన వల్లే నేను చెడిపోతున్నానని, భార్య మాటలు వింటున్నాడని అంటున్నారు. వాళ్ల అమ్మనాన్న లేరనే కదా తనపై ఇలాంటి నిందలు వేస్తున్నారు. వాళ్లే ఉంటే తనని అనేవాళ్ల. నా కూతురి జోలికి వస్తున్నారు. ఇన్ని రోజులు ఆగాను. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్‌ 11) సాయంత్రం ప్రెస్‌ మీట్‌ పెట్టి అన్ని విషయాలు చెబుతాను అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు.

Exit mobile version