Site icon Prime9

Manchu Manoj: ఆస్తుల కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం: మంచు మనోజ్‌

Manchu Manoj Reaction: తనకు తన భార్య, పిల్లలకు రక్షణ లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్‌ ఆరోపించారు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరానని, కానీ తనని కాదని వేరే వాళ్లకు రక్షణ ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రికొడుకు ఒకరిపై ఒకరుపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన తండ్రి మోహన్‌ బాబు వల్ల తనకు ప్రాణ హాని ఉందని మనోజ్.. తన చిన్న కుమారుడు, తన భార్య మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

మనోజ్‌, మోహన్‌ బాబు వివాదం నడుమ మంచు విష్ణు దుబాయ్‌ నుంచి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో మోహన్‌ బాబు, మనోజ్‌, విష్ణులు జలపల్లిలోని ఫామ్‌ హౌజ్‌లో సమావేశం అయ్యారు. అక్కడికి కొందరు బౌన్సర్లు కూడా వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు కూడా భారీగా జల్‌పల్లి ఫాంహౌజ్‌ వద్ద భారీగా మోహరించారు. కాసేపు చర్చ జరిగిన అనంతరం ఫామ్‌ హౌజ్‌ నుంచి మనోజ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తాను ఆస్తుల కోసం పోరాటం చేయడం లేదని ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నా అన్నారు. నా భార్య, పిల్లలకు రక్షణ కోసం పోరాడుతున్నానని, ఈ విషయంలో నాతో ఎంతైన పోరాడమనండి.. కానీ నా భార్య, ఏడేళ్ల కూతురిని ఇన్‌క్లూడ్‌ చేస్తున్నారు.

ఇదంతా నన్ను తొక్కేయడానికి చేస్తున్నారు. ఇందుకోసం నా ఏడేళ్ల పాపను కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. ఇందులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్లి రక్షణ అడిగాను. అంతేకాదు వారి తరపు బౌన్సర్లు వచ్చి అక్కడ దాక్కున్నారని అధారాలు కూడా చూపించారు. వారు మీకు రక్షణ ఇస్తామని ధైర్యం ఇచ్చి ఆ తర్వాత లోపలికి వెళ్లి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్‌ వచ్చి నా మనుషులను భయపెట్టి బయటకు పంపించారు. వారే బాడిగార్డ్స్ లోపలికి పంపించారు. ఈ డిపార్ట్‌మెంట్‌ ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, నా మనుషులకు భయపెట్టి బయటకు పంపించే అధికారం వారికి ఏముంది? వేరే బౌన్సర్లను లోపలికి పంపించే అధికారం ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఈ విషయం రక్షణ కోసం తాను ప్రపంచంలోని అందరిని కలుస్తానంటూ వ్యాఖ్యానించారు.

Exit mobile version
Skip to toolbar