Manchu Manoj Joins in Hospital Video Viral: హీరో మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరాడు. కాగా ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి తనని కొట్టాడంటూ మనోజ్ రాచకొండ పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. దీంతో మోహన్ బాబు మనోజ్ తనపై దాడి చేశాడంటూ ఆరోపించినట్టు తెలుస్తోంది. వీరిద్దరు పరస్పర ఆరోపణలతో పోలీసు స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇదంతా వంటి రూమారే అనే, ఇందులో నిజం లేదంటూ మంచు మోహన్ బాబు పీఆర్ టీం ఈ వార్తలను ఖండిచింది.
కానీ ఈ రూమర్స్ ఆగడంతో లేదు. పైగా తాజాగా మనోజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన భార్య మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ బంజారాహిల్స్‌తోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చేరుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మంచు మనోజ్ కుంటుతూ నడుస్తూ కనిపించాడు. అంతేకాదు కాలు, మెడపై గాయాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ రోజు ఉదయం మంచు ఫ్యామిలీలో ఘర్షణలు అంటూ ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో మనోజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా మంచు ఫ్యామిలీ స్పందించేవరకు వేచి చూడాల్సిందే.