Site icon Prime9

Mamta Mohan Das: నయనతార చేసిన పనికి చాలా బాధపడ్డాను – మమతా మోహన్ దాస్ షాకింగ్ కామెంట్స్‌

Mamta Mohan Das Shocking Comments on Nayanthara: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నయనతార ఫ్యాన్స్‌ వర్సెస్‌ ధనుష్‌ ఫ్యాన్స్‌ వార్‌ నడుస్తోంది. నిన్న తన డాక్యుమెంటరీ విషయంలో ధనుష్‌కి తనకు మధ్య ఉన్న గొడవను బయటపెట్టింది నయన్‌. అంతేకాదు ధనుష్‌ది పక్కవారు ఎదిగితే ఒర్చుకోలేని తత్త్వమని, మంచివాడుగా కపటత్వం చూపిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి కోలీవుడ్‌లో వీరిద్దరి వివాదం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో నయన్‌కు కొందమంది నటీనటులు మద్దతు తెలుపుతుంటే మరికొందరు ధనుష్‌కి సపోర్టు చేస్తున్నారు.

ముఖ్యంగా వీరి ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియాలో పెద్ద యుద్దమే నడుస్తోంది. ఈ క్రమంలో ధనుష్‌ ఫ్యాన్స్‌ నయనతారను ట్రోల్‌ చేస్తూ దారుణంగా విమర్శిస్తున్నారు. తన పర్సనల్‌ లైఫ్‌పై కూడా దారుణమైన కామెంట్స్‌ చేస్తున్నారు. క్యారెక్టర్‌లెస్‌లేడీ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ని కూడా ట్రెండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర నెగిటివిటీ వచ్చింది. ఈ క్రమంలో గతంలో నయనతారపై మమతా మోహన్‌ దాస్‌ చేసిన కామెంట్స్‌ మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో ఓ ఇంటర్య్వూలో నయనతార చేసిన ఓ పనికి తాను ఎంతో బాధపడ్డానంటూ మమతా మోహన్‌ దాస్‌ చేసిన ఈ కామెంట్స్‌ని కొందరు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

అయితే ఇందులో మమతా నయన్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. “నాకు రజనీకాంత్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చింది. పర్టిక్యూలర్‌గా ఒక పాటలో నటించాలని నన్ను అడిగారు. నాలుగు రోజులు షూటింగ్‌ కూడా అయ్యింది. పాట రిలీజ్‌ చేశాక అందులో నా పార్ట్‌ లేదు. మొత్తం కట్‌ చేశారు. ఒక్కచోట మాత్రమే గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తాను. ఎక్కడో బ్యాగ్రౌండ్‌లో నన్ను చూపించారు. అంతా షూట్‌ చేసి నా షాట్స్‌ కట్‌ చేస్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు. ఆ తర్వాత ఒక హీరోయిన్‌ వల్లే నన్ను ఆ పాట నుంచి తీసేశారని తెలిసిందే. ఆమె నయనతార. ఈ పాటలో ఆమె లీడ్ యాక్టర్‌. ‘సెట్‌లో మరో హీరోయిన్‌ ఉంటే నేను షూట్‌కి రాను’ అని చెప్పిందట. దాంతో నన్ను ఆ పాట నుంచి తీసేశారు. ఆమె వల్ల నా నాలుగు రోజుల కష్టం వృథా అయ్యింది. అది నన్ను ఎంతో బాధించింది” అంటూ చెప్పుకొచ్చింది.

అయితే గతంలో ఎప్పుడో చేసిన ఈ కామెంట్స్‌ ధనుష్‌ కొందరు నెటిజన్లు తాజాగా వైరల్‌ చేస్తూ నయనతార నిజస్వరూపం ఇదంటూ ఆమెను టార్గెట్‌ చేస్తున్నారు. వీటిపై ధనుష్‌ ఫ్యాన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. దీన్ని ఏమంటారని, కో యాక్టర్స్‌ తొక్కేసి నీకు మాత్రమే గుర్తింపు రావాలనుకోవడం మంచి వ్యక్తిత్వమా? ధనుష్‌ పక్కవారు ఎదిగితే ఓర్వలేరు అని అన్నావ్‌.. మరి నువ్వు చేసిందేమిటీ అంటూ నయనతారపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నయనతార, రజనీకాంత్‌ నటించిన ఆ చిత్ర కథానాయకుడు. ఇందులో వారిద్దరికి సంబంధించి ఒక పాట షూట్‌ మాత్రమే ఉంటుంది. 2008లో విడుదలైన ఈ చిత్రంలో దేడువే స్వర్గం నుంచి అనే పాటలో రజనీ, నయన్‌లు కలిసి నటించారు. ఈ పాట కోసమే మమతా మోహన్‌ దాస్‌ని తీసుకుని షూట్‌ కూడా చేశాక.. నయనతార అలిగి మమతా మోహన్‌ దాస్‌ను తప్పించింది.

Exit mobile version