Site icon Prime9

Salaar 2: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ – ‘సలార్‌ 2’ నుంచి క్రేజీ అప్‌డేట్‌..

Prabhas Salaar 2 Begins: ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సలార్‌ టీం గుడ్‌న్యూస్‌ అందించింది. ప్రభాస్‌ హీరోగా ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయం సాధిచింది. రిలీజైన అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్‌ అందుకుంది. థియేట్రికల్‌ రన్‌లో ఈ సినిమా రూ. 700లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ మూవీ భారీ విజయంతో ‘సలార్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘సలార్‌: శౌర్యంగ పర్వం’ వస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్‌పై వస్తుందా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూవీ షూటింగ్‌పై సలార్‌ టీం అప్‌డేట్‌ ఇచ్చింది. సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసందే. ప్రభాస్‌ స్నేహితుడిగా రాజమన్నార్‌ పాత్రలో ఆయన ఆకట్టుకున్నారు. తాజాగా సలార్‌ 2 షూటింగ్‌ అప్‌డేట్‌ ఇస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది. “ప్రయాణం అద్భుతంగా సాగుతుంది.. సలార్‌ 2 షూటింగ్‌ స్టార్ట్‌” అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, శ్రియా రెడ్డి, జాన్సీ వంటి తదితర నటులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా సలార్‌ 2 షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్‌ తెలిపారు. ఇప్పుడు మొదలైన ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ 20 రోజులు జరగనుందట. ఇందులో ప్రభాస్‌ జాయిన్‌ కానున్నాడని సమాచారం. కాగా ప్రస్తుతం ప్రభాస్‌ డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ రిలీజ్‌ అవ్వగా దానికి విశేష స్పందన వచ్చింది. ఇందులో ప్రభాస్‌ రాజుగా రాయల్‌ లుక్‌లో నోట్లో సిగార్‌తో కనిపించాడు. దీంతో రాజాసాబ్‌పై మరిన్న అంచనాలు నెలకొన్నాయ. హారర్‌, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

Exit mobile version