Site icon Prime9

ఆ విషయంలో నాకు మహేష్ కి గొడవలు జరుగుతున్నాయి : నమ్రత

mahesh babu wife namratha shocking comments about marriage life

mahesh babu wife namratha shocking comments about marriage life

నమ్రత శిరోద్కర్ : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మోస్ట్ లవ్డ్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రత ఉంటారు. ‘వంశీ’ సినిమాతో మహేష్-నమ్రతల మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకొని ఒకటి అయ్యారు ఈ జంట. వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ లో సూపర్ స్టార్‏గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నమ్రత మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. ఇక ఇంటి బాధ్యతలు, వ్యాపార విషయాలను నమ్రత జీవితాన్ని గడిపేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే నమ్రత వారి ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత… మహేష్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. మహేష్, నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన రోజది అని అన్నారు. అలానే సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేశాను. కొద్ది రోజులకే మోడలింగ్ బోర్ కొట్టడంతో సినిమా పరిశ్రమ వైపు వచ్చాను. నటిగా ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశాను. అప్పుడే మహేష్ ను కలిశాను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. కాబోయే సతీమణి ఎలా ఉండాలనే విషయంలో తనకు స్పష్టమైన ఆలోచన ఉంది. అందుకే నేను సినిమాలకు దూరమయ్యాను. పెళ్లి అయ్యాక కూడా నాకు అవకాశాలు వచ్చాయి. కాకపోతే నటించాలనే ఉద్ధేశం లేదు. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.

గొడవ గురించి ఏమన్నారంటే…

కాగా మహేష్‌కి తనకి నిత్యం ఒక విషయంలో గొడవలు జరుగుతాయని నమ్రత తెలిపారు. పిల్లలు ప్రతిదీ మహేష్‌నే అడుగుతుంటారు. అయన వాళ్ళు ఏది అడిగిన చేసేస్తుంటారు. అది నాకు నచ్చదు. అలా ఆ విషయంలో మేము ఇద్దరం గొడవ పడుతుంటాము అని చెప్పారు. అలాగే మహేష్ బాబు సినిమాల్లో తనకి పోకిరి సినిమా అంటే చాలా ఇష్టమని… ముఖ్యంగా ఆ సినిమా లోని పంచ్ డైలాగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తానని వెల్లడించారు. ఇక ఇటీవలే నమ్రత పేరు మీద బంజారాహిల్స్ లో ఒక రెస్టారెంట్ ని మొదలుపెట్టాడు మహేష్ బాబు. ఈ ఏడాది లోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్ అన్నకు మీరే ధైర్యం చెప్పాలి వదిన అంటూ మహేష్ బాబు అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version