Site icon Prime9

Jawan Movie : “జవాన్” మూవీ ఫ్యామిలితో పాటు చూస్తానన్న మహేష్.. ఎప్పుడో చెప్తే నేను వస్తానంటున్న షారూఖ్ !

mahesh babu and sharukh khan tweets about jawan movie

mahesh babu and sharukh khan tweets about jawan movie

Jawan Movie : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం “జవాన్”. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేస్తుండడం గమనార్హం. అలానే ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరవబోతుంది. ఇక ఈ మూవీని ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే మరి టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో అని ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రిలీజ్ ని విష్ చేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ట్వీట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక ట్వీట్ చేశాడు. జవాన్ టైమ్‌ వచ్చేసింది. షారుక్ ఖాన్ పవర్ మొత్తం వెండితెరపై కనబడబోతుంది. ఈ సినిమా అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ మహేష్ ట్వీట్ చేయగా.. ఆ  ట్వీట్‌ తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

ఇక ఈ ట్వీట్ కి తాజాగా  షారుఖ్ రియాక్ట్ అయ్యాడు. “థాంక్యూ మై ఫ్రెండ్. ఈ సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ సినిమాని ఎక్కడ చూస్తారో చెప్పండి. నేను మీతో కలిసి చూస్తాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

 

Exit mobile version