GT vs LSG: విధ్వంసం సృష్టించిన గిల్, సాహా.. లక్నో లక్ష్యం 228 పరుగులు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో గుజ‌రాత్ టైటాన్స్  త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ల‌క్నో ఫీల్డింగ్ ఎంచుకుంది.

GT vs LSG: గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. సాహా, గిల్ విధ్వంసం సృష్టించడంతో.. గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సాహా 83 పరుగులు చేయగా.. గిల్ 94 పరుగులు చేశాడు.

లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్, మోహిసిన్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 07 May 2023 06:56 PM (IST)

    GT vs LSG: మూడో వికెట్ కోల్పోయిన లక్నో

    లక్నో మూడో వికెట్ కోల్పోయింది. స్టాయినిస్ మోహిత్ శర్మ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.

  • 07 May 2023 06:39 PM (IST)

    GT vs LSG: క్వింటాన్ డికాక్ అర్దసెంచరీ.. కట్టుదిట్టంగా గుజరాత్ బౌలింగ్

    క్వింటన్ డికాక్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో క్విటన్ మెుదటి మ్యాచ్ ఆడుతున్నాడు.

  • 07 May 2023 06:28 PM (IST)

    GT vs LSG: డికాక్ పరుగుల సునామీ.. 100 పరుగులు దాటిన లక్నో

    క్వింటాన్ డికాక్ పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో లక్నో 10 ఓవర్లలోనే 100 పరుగులు దాటింది.

  • 07 May 2023 06:18 PM (IST)

    GT vs LSG: తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మేయర్స్ ఔట్

    మోహిత్ శర్మ వేసిన ఓవర్లో మేయర్స్ ఔటయ్యాడు. దీంతో లక్నో తొలి వికెట్ కోల్పోయింది.

  • 07 May 2023 06:15 PM (IST)

    GT vs LSG: ధాటిగా ఆడుతున్న లక్నో.. 8 ఓవర్లకు 88 పరుగులు

    లక్నో ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. 8 ఓవర్లకు ఆ జట్టు 88 పరుగులు చేసింది.

  • 07 May 2023 05:42 PM (IST)

    GT vs LSG: రెండు ఓవర్లకు 16 పరుగులు చేసిన లక్నో

    రెండు ఓవర్లు ముగిసేసరికి లక్నో 16 పరుగులు చేసింది.

  • 07 May 2023 05:12 PM (IST)

    GT vs LSG: విధ్వంసం సృష్టించిన గిల్, సాహా.. లక్నో లక్ష్యం 228 పరుగులు

    గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. సాహా, గిల్ విధ్వంసం సృష్టించడంతో.. గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సాహా 83 పరుగులు చేయగా.. గిల్ 94 పరుగులు చేశాడు.

    లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్, మోహిసిన్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

  • 07 May 2023 05:02 PM (IST)

    GT vs LSG: సెంచరీకి చేరువలో గిల్

    గుజరాత్ 18 ఓవర్లకు 202 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 07 May 2023 04:52 PM (IST)

    GT vs LSG: రెండో వికెట్ డౌన్.. హార్దీక్ పాండ్యా ఔట్

    గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. మోసిన్ ఖాన్ బౌలింగ్ లో పాండ్యా క్యాచ్ ఔటయ్యాడు.

  • 07 May 2023 04:48 PM (IST)

    GT vs LSG: 15 ఓవర్లకు.. 176 పరుగులు

    గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. హార్దీక్, గిల్ సిక్సర్లతో చెలరేగుతున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 176 పరుగులు చేసింది.

  • 07 May 2023 04:31 PM (IST)

    GT vs LSG: తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..

    గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో సాహా క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ వద్ద కృనాల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

    సాహా 43 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి.

     

  • 07 May 2023 04:25 PM (IST)

    GT vs LSG: గిల్ అర్దసెంచరీ.. భారీ స్కోర్ దిశగా గుజరాత్

    గుజరాత్ ఓపెనర్లు ఇద్దరు అర్దసెంచరీ సాధించారు. 29 బంతుల్లో గిల్ 50 పరుగులు చేశాడు.

  • 07 May 2023 04:16 PM (IST)

    GT vs LSG: గిల్ వరుస సిక్సులు

    రవి బిష్ణోయ్ వేసిన 9 ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఇందులో రెండు సిక్సులు ఉన్నాయి.

  • 07 May 2023 04:12 PM (IST)

    GT vs LSG: 8 ఓవర్లకే 98 పరుగులు

    లక్నో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. గుజరాత్ 8 ఓవర్లలో 98 పరుగులు చేసింది.

  • 07 May 2023 04:00 PM (IST)

    GT vs LSG: పవర్ ప్లే లో సిక్సుల వర్షం..

    పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 78 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లు సిక్సులతో చెలరేగిపోతున్నారు.

  • 07 May 2023 03:56 PM (IST)

    GT vs LSG: వరుస సిక్సులు.. సాహా అర్దసెంచరీ

    వృద్ధిమాన్ సాహా సిక్సులతో చెలరేగిపోతున్నాడు. కేవలం 20 బంతుల్లో అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • 07 May 2023 03:50 PM (IST)

    GT vs LSG: సాహా విధ్వంసం.. సిక్సులు, ఫోర్లు

    వృద్ధిమాన్ సాహా విధ్వంసం సృష్టిస్తున్నాడు. వరుస సిక్సులు, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

    గుజరాత్ నాలుగు ఓవర్లు ముగిసేసరికి 53 పరుగులు చేసింది.

  • 07 May 2023 03:45 PM (IST)

    GT vs LSG: మూడో ఓవర్.. 8 పరుగులు మాత్రమే

    కృనాల్ వేసిన 3 ఓవర్లో 8 పరుగలు వచ్చాయి.

  • 07 May 2023 03:42 PM (IST)

    GT vs LSG: రెండో ఓవర్లో 11 పరుగులు

    ఆవేష్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతులను సాహా సిక్స్ ఫోర్ కొట్టాడు.

  • 07 May 2023 03:37 PM (IST)

    GT vs LSG: తొలి ఓవర్లో 12 పరుగులు

    మోసిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లు 12 పరుగులు వచ్చాయి. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి.

  • 07 May 2023 03:31 PM (IST)

    GT vs LSG: క్రీజులోకి శుభ్ మన్ గిల్, సాహా

    మోహిసిన్ ఖాన్ తొలి ఓవర్ వేస్తున్నాడు.

  • 07 May 2023 03:17 PM (IST)

    GT vs LSG: లక్నో బౌలింగ్.. టీం ఇదే

    క్వింటన్ డికాక్(వికెట్ కీప‌ర్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా(కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్

  • 07 May 2023 03:17 PM (IST)

    GT vs LSG: గుజరాత్ బ్యాటింగ్.. జట్టు ఇదే

    వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

  • 07 May 2023 03:13 PM (IST)

    GT vs LSG: టాస్ గెలిచిన లక్నో

    టాస్ గెలిచిన ల‌క్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

  • 07 May 2023 03:12 PM (IST)

    GT vs LSG: తొలి సారి అన్నదమ్ముల మధ్య పోరు

    ఐపీఎల్ లో ఆసక్తిర పోరుకు సిద్దమైంది. నేటి మ్యాచ్ అన్నదమ్ముల మధ్య పోరు కానుంది. గుజరాత్ కు హర్దీక్ పాండ్యా, లక్నోకు కృనాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు.