India vs Australia T20: జింఖానా గ్రౌండ్ వద్ద మహిళ మృతి.. పరిస్ధితి ఉద్రిక్తత్తం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులతో ఆటలాడుకొంటుంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో అడ్డదారులు దొక్కుతూ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తమ ప్లేయర్స్ కొట్టే షాట్ల కోసం గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు

Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులతో ఆటలాడుకొంటుంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో అడ్డదారులు దొక్కుతూ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తమ ప్లేయర్స్ కొట్టే షాట్ల కోసం గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. తీరా టిక్కెట్లు లేవన్న వార్తలతో ఒక్కసారిగా టిక్కెట్లు కౌంటర్ వద్ద తోపులాట ప్రారంభమై, అది కాస్తా లాఠీచార్జ్ వరకు వెళ్లిన సంఘటన హైదరాబాదు జింఖానా గ్రౌండ్స్ వద్ద చోటుచేసుకొనింది.

సమాచారం మేరకు ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ జరగనుంది. స్టేడియంలో క్రికెట్ ను వీక్షించేందుకు సీటింగ్ కెపాసిటికి తగ్గట్టుగా 60వేల మందికి టిక్కెట్లు అమ్మేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. రూ. 800 నుండి రూ. 10000 వేల రూపాయల వరకు వివిధ తరగతుల్లో టిక్కెట్లు విక్రయించనున్నారు. అయితే టిక్కెట్ల విక్రయాలను ముందస్తుగానే నిర్వాహకులు చేపట్టేసారు. ఈ విషయాన్ని దాచివుంచడంతో అభిమానులు టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.

నేడు టిక్కెట్లు ఇస్తారన్న విషయాన్ని తెలుసుకొన్న అభిమానులు వేల సంఖ్యలో జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకొన్నారు. అయితే టిక్కెట్లు లేవన్న వార్తలు జోరందుకోవడంతో ఒక్కసారిగా క్యూలైన్లలో తోపులాట ప్రారంభమైంది. దీంతో పోలీసులు, అభిమానులు అందరూ నానా ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో పరస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేపట్టారు. దీంతో ఒకరి పై ఒకరు తోసుకుంటూ పరుగులు తీసారు. ఘటనలో 20 మందికి తీవ్రగాయాలు కాగ, ఓ మహిళ మృతి చెందింది. పరిస్ధితి ఉద్రిక్తత్తంగా మారింది.

మరో వైపు టిక్కెట్ల అమ్మాకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. అవకతవకలు జరిగాయంటున్నారని ఒప్పుకొనేది లేదంటూ మంత్రి శ్రీనివాస గౌడ్ స్పష్టం చేశారు. దీంతో టిక్కెట్ల అమ్మకాల విషయంలో అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. తరగతి వారీగా ఏ ధరకు ఎన్ని టిక్కెట్లు ఉన్నాయో తెలిపే ధరల పట్టికను ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఆన్ లైన్ లో అమ్మకాలు జరిగిపోయాయంటూ పేర్కొనడం గమనార్హం. చాలా నెలల తర్వాత క్రికెట్ మ్యాచ్ ను హైదరాబాదులో చేపడుతున్నారన్న సంగతిని ప్రభుత్వం విస్మరించింది. టెక్కెట్ల అమ్మకాలపై నిర్వాహకులకు తగిన సూచనలు ఇచ్చేందులో విఫలం చెందడంతో పరస్ధితి ఉద్రిక్తతకు దారితీసింది. క్రికెట్ పిచ్చి ఓ ప్రాణం ఖరీదుగా జరగనున్న మ్యాచ్ అందరికి గుర్తుండిపోతుంది.