Site icon Prime9

Ktr in Assembly: మోదీ భజన ఆపండి.. విభజన హామీలను నెరవేర్చండి- కేటీఆర్‌

ktr assembly

ktr assembly

Ktr in Assembly: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ గా కేటీఆర్ ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూ.. కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఇపుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశానికి దారిచూపే టార్చ్‌బేరర్‌గా తెలంగాణ మారిందని తెలిపారు. కడుపు నింపుకునే స్థాయి నుంచి.. దేశ కడుపు నింపే స్థాయికి రాష్ట్రం చేరిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

కరోనా సమయంలో.. 7 వేల కొనుగోలు కేంద్రాలతో ధాన్యం సేకరించామన్నారు. రైతుబంధు పథకం.. దేశంలో గొప్ప పథకమన్నారు.

అసాధారణమైన కార్యక్రమాలు.. అసాధారణమైన నాయకులకే ఈ ఆలోచనలు వస్తాయన్నారు.

65 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్‌ 65వేల కోట్ల రూపాయలు జమ చేశారని.. ప్రపంచంలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదని వివరించారు.

ఐక్యరాజ్య సమితి కూడా రైతుబంధు పథకాన్ని ప్రశంసించిందని తెలిపారు.

రాష్ట్రంలో 94వేల కుటుంబాలకు పైగా రైతు బీమాతో ఆదుకున్నాము. పార్టీలు చూడకుండా.. రాజకీయాలు చేయకుండా అందరిని సమానంగా చూశామన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలతో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రైతులను కూడా ఆదుకున్నామని కేటీఆర్ అన్నారు.

డిస్కంలను ఎందుకు ప్రైవేటీకరించాలని..? ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రశ్నించారు.

రైతులపై కేంద్రం కక్ష కట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామన్నారు. రైతు రాజ్యం కావాలంటే.. బీజేపీ కార్పొరేట్‌ రాజ్యం కావాలంటోందని ఎద్దేవా చేశారు.

గుజరాత్‌లో పైకి బిల్డప్‌ తప్ప లోపల ఏమీ ఉండదన్నారు. నాయకుడు నటించడని.. లీనమైన పనిచేయాలని సూచించారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈటల రాజేందర్ పై కేటీఆర్ కామెంట్స్ చేశారు.

పల్లెలు ప్రగతిపథంలో ముందుకుపోతున్నాయని అన్నారు.

మన్ కీ బాత్ ని మంకీ బాత్ చేసిన కేటీఆర్..

కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శించారు. మోదీ లక్ష్యంగా పలు విమర్శలు చేశారు.

మోదీ నిర్వహించే మన్ కీ బాత్ ను కేటీఆర్ మంకీ బాత్ తో పోల్చారు. ఇందులో ప్రధాని సొల్లు వాగడం తప్పా.. దేశానికి పెద్దగా ఉపయోగపడింది ఏది లేదన్నారు.

ఐటీ రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని.. ఐటీ కేంద్రానికి హైదరాబాద్ ఇప్పుడు అడ్డాగా మారిందని కేటీఆర్ గుర్తు చేశారు.

ఆకలితైనా ఉంటాం గానీ.. ఆత్మ గౌరవాన్ని చంపుకోమని అన్నారు. ఆత్మగౌరవం జోలికొస్తే సహించేది లేదని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందని అన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version