Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( congress) లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజూకూ ఎక్కువవుతున్నాయి. పార్టీలో ఏ నేత.. ఎప్పుడు ఎవరిపై విమర్శలకు దిగుతారో చెప్పలేని పరిస్థితి.
అధిష్టానం ఎన్ని పంచాయితీలు పెట్టినా .. ఇక్కడి నేతల మధ్య మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు.
అందరం కలిసి పనిచేయక పోవడంతోనే ఓడిపోయామని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి పనిచేయాలని పార్టీ నేతలు కోరారు ఆమె.
పార్టీకి నష్టం చేసే వారిని ఉపేక్షించడం ఎందుకు అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ.
అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) పైన కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ కి ప్రజలు ఓట్లు వేయరన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధైర్యం ఉంటే కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తెలిపారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ కోవర్ట్ అని.. ఈ పార్టీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బీజేపీ పార్టీలోకి తీసుకోలేదని అన్నారు.
అందుకే వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగాలని అనుకుంటున్నాడని ఆమె వ్యాఖ్యలు చేశారు.
మరో వైపు పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమాక్క కలిసి పాదయాత్ర చేస్తే పార్టీ కి మేలు జరుగుతుందని ఆమె అన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు పార్టీ కి ఎనలేని గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగ ఆమె గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లగలమని కొండా సురేఖ తెలిపారు.
స్పందించిన రేవంత్ రెడ్డి
అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. నాయకులకు సంబంధించిన అంశాలు గానీ, వ్యక్తిగత అంశాలను కార్యవర్గ సమావేశంలో చర్చించవద్దన్నారు.
ఏదైనా సమస్యలు ఉంటే పార్టీ వ్యవహారాల ఇంఛార్జిను కలవాలని రేవంత్ సూచించారు. ఇది పార్టీ సమావేశమని .. సమావేశ అజెండాపైనా మాట్లాడాలని రేవంత్ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే శుక్రవారం తెలంగాణ వచ్చారు.
ఈ క్రమంలో గాంధీభవన్ లో పలువురు కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. అయుతే గాంధీ భవన్ మెట్లెక్కనన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.
అనంతరం రేవంత్ రెడ్డితో భేటీ అయి కాసేపు మాట్లాడారు. అయితే పార్టీలో ఇప్పడిప్పుడే వ్వవహారాలు చక్కదిద్దే క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కాక రేపాయి.
ఈ రోజు సమావేశంలో కొండా సురేఖ కోమటిరెడ్డి పై వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/