Site icon Prime9

Karthi: దీపావళికి కార్తీ “సర్దార్” వచ్చేస్తున్నాడు..!

karthi sardar movie twitter review

karthi sardar movie twitter review

Karthi: కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఇటీవల రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్‌. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా, రజీషా విజయన్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

కాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కార్తీ ఈ సినిమాలో ఆరు గెటప్స్ వేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించనున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ మూవీనిప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. మీరు వెతుకుతున్న స్పై పేరు ఏంటి?, అతనికి ఎనిమిది దేశాల పాస్‌పోర్ట్స్‌ ఉన్నాయి, ఆరువందల సార్లు ఇంట్రాగేట్‌ చేశాం.
ప్రతిసారీ ఒక్కో లాంగ్వేజ్‌.. ఒక్కో కథ.. ఇవన్నీ నిజమేనని మిషన్‌ చెబుతోంది, ఆ ఆరుమంది ఒక్కరే.. అంటూ వినిపించే ఈ టీజర్లోని డైలాగ్స్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఇదీ చదవండి: వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు.. నెట్టింట సమంత పోస్ట్ వైరల్

Exit mobile version