Site icon Prime9

KA Trailer: మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడుతున్న ఊరు – థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘క’ ట్రైలర్‌,చూశారా?

KA Trailer

KA Movie Trailer Out: టాలంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తోన్న లేటెస్ట్‌ మూవీ ‘క’. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్ దర్శకత్వంలో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. పాన్‌ స్థాయిలో భారీ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. పైగా ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, పాటలకు కూడా ఆడియన్స్‌ నుంచి మంచి రెస్సాన్స్‌ వచ్చాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘క’ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీం. తాజాగా విడుదలైన ట్రైలర్‌ విలేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ థ్రిల్లింగ్‌ అంశాలతో ఆద్యాంతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కిరణ్‌ అబ్బవరం పోస్ట్‌మ్యాన్‌ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలా కృష్ణగిరి అనే ఊరికి ట్రాన్స్‌ఫర్‌ అవ్వడంతో అక్కడికి వెళ్లిన అతడికి వింత అనుభవం ఎదురవుతుంది. ఆ ఊరిలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అవుతుంది. గౌతమ్‌ వాసుదేవ్‌ ఆ ఊరికి రాగానే ఆ గ్రామ వ్యక్తి ఊరి గురించి వివరిస్తున్నట్టుగా ట్రైలర్‌ చూపించారు. ఆ తర్వాత అదే ఊరిలో హీరోయిన్‌ చూసి పడిపోతాడు.

అలా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కూల్‌గా సాగుతున్న ఈ ట్రైలర్‌ ఒక్కసారిగా సీరియస్‌ మోడ్‌లోకి వెళుతుంది. పోస్ట్‌ మ్యాన్‌ అయిన గౌతమ్‌ వాసు దేవ్‌ కొందరు ముసుగు వ్యక్తులు టార్గెట్‌ చేస్తుంటారు. 1979 ఏప్రిల్‌ 22 అభిషేక్‌ పేరుతో వచ్చిన ఆ ఉత్తరం వాసు దేవ్‌ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరం చదివిన అతడిని ముసుగు వ్యక్తులు ఫాలో అయ్యి ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ బెదిరిస్తాడు. అదే టైంలో గౌతమ్‌ వాసుదేవ్‌ వింతగా ప్రవర్తిస్తాడు. అమాయకంగా కనిపించే వాసుదేవ్‌ ఉన్నట్టుండి వైయిలెన్స్‌గా మారతాడు. మరి పోస్ట్‌ మ్యాన్‌ అయిన గౌతమ్‌ వాసు దేవ్‌ ఎందుకు అలా ప్రవర్తించాడు, ఇంతకి ఆ ఉత్తరంలో ఏముందనేది ట్రైలర్‌లో రివీల్‌ చేయకుండ సస్పెన్స్‌లో ఉంచి మూవీపై హైప్ పెంచారు. ప్రస్తుతం ‘క’కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

Exit mobile version