BRS meeting in Khammam: గవర్నర్ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారాయి.. కేరళ సీఎం పినరయి విజయన్

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) అన్నారు. ప్రజల సౌకర్యం కోసం అన్నీ జిల్లాల్లో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు.

BRS meeting in Khammam: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) అన్నారు.

ప్రజల సౌకర్యం కోసం అన్నీ జిల్లాల్లో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు.

కంటి వెలుగు పథకాలు లక్షలాది మంది లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరమని విజయన్ అన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి

దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని విజయన్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలన్నారు.

ఫెడరల్ స్తూర్తికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. కార్పొరేట్లకు నరేంద్ర మోదీ తొత్తుగా మారారని.. రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తోందన్నారు.

కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలన్నారు.

మరోవైపు దేశంలో గవర్నర్ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విజయన్.

సుప్రీం కోర్టులనే నేరుగా బెదిరించే స్థాయికి బీజేపీ(BJP) మంత్రులు చేరారని తెలిపారు.

బీజేపీ కి వ్యతిరేకంగా అన్నీ పార్టీలను ఏకం చేసిన కేసీఆర్ కు(Cm kcr) కృతజ్ఞతలు తెలిపారు విజయన్. ఈ సభ దేశానికి ఓ దిక్సూచి అన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని విజయన్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

అనంతరం విజయన్ ను ఘనంగా సత్కరించారు.

కాగా , సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది.

జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే ఉంది. ఈ సభకు పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు.

బహిరంగసభలో పాల్గొనేందుకు డిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎలు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు పాల్గొన్నారు.

అంతకు ముందు ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు.

ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభం అనంతరం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్.

కేసీఆర్, కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్ చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.

జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.

బీఆర్ఎస్ సభ ( BRS meeting) గులాబీమయం

సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) సభకు ( BRS meeting In Khammam) ఖమ్మం సిద్ధమైంది.

భారీ సభతో ఖమ్మం మొత్తం గులాబీమయమైంది. నగరం చుట్టూ దాదాపు 5 కిలో మీటర్ల వరకు గులాబీ తోరణాలు, హోర్డింగ్స్, భారీ కటౌట్స్, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన నేతలంతా ఖమ్మం సభకు హాజరవుతున్నారు. మరో వైపు సభకు పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/