Site icon Prime9

Keerthy Suresh: వచ్చే నెలలో నా పెళ్లి – తిరుమలలో కీర్తి సురేష్‌ ప్రకటన

keerthy suresh at tirumla

Keerthy Suresh Visits Tirumala: హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను మరింత బలం చేకూరుస్తూ బాయ్‌ఫ్రెండ్‌ పరిచయం చేసింది కీర్తి. ఇప్పుడు తాజాగా తన పెళ్లిపై స్వయంగా ప్రకటన ఇచ్చింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో శుక్రవారం (నవంబర్‌ 20) ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కుటుంబంతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంది.

దర్శనం అనంతరం ఆమె రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం బయటకు వచ్చిన కీర్తి సురేష్‌ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తన పెళ్లిపై నోరు విప్పింది. వచ్చే నెలలో తన పెళ్లి ఉందని, అందుకే స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుపతి వచ్చినట్టు తెలిపింది. ఇక పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అని అడగ్గా గోవాలో అని స్పష్టం చేసింది. దీంతో కొద్ది రోజులుగా ఆమె పెళ్లి జరుగుతున్న ప్రచారం నిజమని తేలిపోయింది.

గోవాలో పెళ్లి

కాగా కీర్తి సురేష్‌ తన చిరకాల మిత్రుడు ఆంటోని కట్టల్‌తోనే ఏడడుగులు వేయబోతుంది. రెండు రోజుల క్రితమే ప్రియుడిని పరిచయం చేస్తూ అతడి పేరు ఆంటోని అని చెప్పింది. అతడు దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త. కొచ్చిలో జన్మించిన అతడికి ఇండియాలోనూ పలు బిజినెస్‌లు ఉన్నాయి. ఎంతోకాలంలో ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది చివరిలో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. కోలీవుడ్‌లో మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. డిసెంబర్‌ 11,12 తేదీల్లో గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని తెలుస్తోంది. ఈ పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, ఇండస్ట్రీల ప్రముఖులు హాజరుకున్నారట.

ఇక కీర్తి సినిమాల విషయానికి వస్తే.. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె బేబీ జాన్‌ సినిమాలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తై విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషనల్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇందులో కీర్తి, బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ఈ సినిమా నుంచి ఓ లవ్‌ సాంగ్‌ రిలీజ్‌ కాగా దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Exit mobile version